YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సింగరేణి సమ్మె సక్సెస్

సింగరేణి సమ్మె సక్సెస్

కరీంనగర్, దేశవ్యాప్తంగా బొగ్గు గనులను ప్రైవేటీకరణ, తోపాటు తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు
పిలుపు నిచ్చాయి. ఐదు జాతీయ సంఘాలతో పాటు మన రాష్ట్రంలోని సింగరేణి గుర్తింపు సంఘం టిబిజికెఎస్  సమ్మెకు మద్దతు ప్రకటించింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సమ్మెలో
స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సింగరేణిలో ఉద్యోగులు ఒక రోజు సమ్మె తో సంస్థకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా 80 కోట్ల
మేర సంస్థ ఆదాయానికి నష్టం చేకూరనుంది.  వీటితో పాటు సమ్మె లో  పాల్గొన్న కార్మికులు తమ వేతనాలను కోల్పోనున్నారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో సంస్థ మనుగడకే ముప్పు
వాటిల్లే ప్రమాదం ఉందని కార్మికులు తాత్కాలిక నష్టానికంటే భవిష్యత్తులో పరిశ్రమను కాపాడుకోవాలన్న ఆలోచనతో సమ్మెకు సై అన్నారు.
సింగరేణి సంస్థ లో గుర్తింపు సంఘం తో పాటు ఐదు జాతీయ సంఘాలు ఇచ్చిన టోకెన్ సమ్మె తో రామగుండం రీజియన్ లోని నాలుగు ఓ సి పి లతో పాటు 8 భూగర్భ గనులలో బొగ్గు ఉత్పత్తి లేక
మూగబోయాయి. దేశవ్యాప్త బొగ్గు గనుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల తో కార్మికుల మనుగడే ప్రశ్నార్థకం కావడంతో ఒక్కరోజు టోకెన్ సమ్మె లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గత పది సంవత్సరాలుగా ఎలాంటి సమ్మెలకు పోకుండా ఉత్పత్తి లక్ష్యంగా పని చేసిన సింగరేణి కార్మికులు కేంద్ర ప్రభుత్వం వైఖరి పై కదంతొక్కారు.  తెలంగాణ రాష్ట్రం కోసం 45 రోజుల సమ్మె చేసి సాధించిన సింగరేణి కార్మికులు దేశవ్యాప్త బొగ్గు గనుల్లో ఐ ఎఫ్ డి లను వ్యతిరేకిస్తు సమ్మెను సక్సెస్ చేశారు.

Related Posts