గద్వాల, మంగళవారం మల్దకల్ కేంద్రంలోని బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగినది 18 సంవత్సరాలు నిండిన మహిళా అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్, ప్రతి ఆడపడుచుకు కొడుకుగా , అన్నగా, తమ్ముడిగా దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. రైతు బీమా, రైతు బంధువు, 24 కరెంటు కళ్యాణం లక్ష్మి, కంటి వెలుగు పథకాలు , అలాగే ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి రెండు పంటలకు నీళ్ల సదుపాయం కల్పించడంతో చివరి ఆయకట్టు వరకు ప్రతి ఒక్క రైతుకు నీరు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో మల్దకల్ మండలం ఎం.పీ.పీ రాజారెడ్డి, మల్దకల్ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మల్దకల్ మండలం పార్టీ అధ్యక్షుడు శేషం పల్లి నర్సింహులు రెడ్డి, రైతు సమన్వయం సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ మాణిక్య రెడ్డి, తెరాస పార్టీ నాయకులు అజయ్ ,ధర్మం రెడ్డి తిమ్మ రెడ్డి తూం కృష్ణ రెడ్డి నరసింహా రెడ్డి , ప్రహల్లాద రావు, సీతారాంరెడ్డి, సత్యం రెడ్డి భాస్కర్, అంజనేయులు, విక్రమ్ సింహారెడ్డి, వెంకటన్న, నరేందర్ , తిమ్మరాజు, ఎమ్మార్వో జ్యోతి, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు