విజయవాడ, రైల్వే శాఖ అధికారులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని మండిపడ్డారు. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన రైల్వే జీఎంతో ఎంపీల సమావేశానికి హాజరైన నాని రైల్వే శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రైళ్లు, కొత్త లైన్లు అడిగినా ఇవ్వలేదంటూ సమావేశంలో ఆగ్రహం
వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు అడిగామని ఒక్కటి కూడా ఇవ్వలేదంటూ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ పరిధి తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. సమావేశంలో ఉండాలని అధికారులు కోరినప్పటికీ ఎంపీ కేశినేని నాని మాత్రం
ససేమిరా అంటూ బయటకు వచ్చేశారు.