YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ సతీమణి విద్యాబాలన్

Highlights

  • ఎన్టీఆర్ గా బాలకృష్ణ
  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • విద్యాబాలన్ ను సంప్రదించిన తేజ 
  •  29వ తేదీన ముహూర్తం షాట్..
ఎన్టీఆర్ సతీమణి విద్యాబాలన్

సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి నందమూరి బాసతారకం పాత్రను బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పోషించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సతీమణి పాత్రను ఎవరు పోషించనున్నారనేది నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న తరుణంలో విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చింది.

వాస్తవానికి  ఆమె నిజ జీవిత పాత్రలను .. బరువైన పాత్రలను పోషించడంలో  అసమానమైన ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఆ తరహా పాత్రలకు ఆమె నిండుదనాన్ని తీసుకొస్తూ ఉంటారు. అందువల్లనే ఆమెను దర్శకుడు తేజ కలిసి కథ .. పాత్ర గురించి వివరించారట. దాంతో వెంటనే ఈ సినిమా చేయడానికి విద్యాబాలన్ అంగీకరించారని చెబుతున్నారు.

ఈ నెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలిసే ఛాన్స్ వుంది. 


 

Related Posts