YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆ వార్త కల్పితం ఏపీ సీఎం కార్యాలయం ప్రకటన

ఆ వార్త కల్పితం ఏపీ సీఎం కార్యాలయం ప్రకటన

అమరావతి, కేంద్రంపై ఇద్దరు ముఖ్యమంత్రుల అసంతృప్తి అంటూ ప్రచురితమైన ఒక వార్త పూర్తిగా కల్పితమని  ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కోంది. సోమవారం జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదు.ఊహా జనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించింది. ఆ దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం,
ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం. ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలæలక్ష్యంగా ఈ సమావేశం సాగిందిని ప్రకటనలో పేర్కోంది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల
లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని ప్రకటించింది. గోదావరి జలాలను తరలింపుద్వారా సాగర్ కుడికాల్వ కింద ఉన్న కృష్ణాడెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల మఖ్యంత్రులు చర్చించారు. పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను కుడా  చర్చించారు. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్కానిస్టేబుళ్లకు ఏపీలోకూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారు. నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ  చోటు చేసుకోలేదు. ఇలాంటి సమావేశంమీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని పేర్కోంది. ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని  ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Related Posts