Highlights
- పారితోషకం 10 కోట్లు అంట.
- మూడవ సినిమాకి నిర్మాత ఆసక్తి
అక్కినేని వంశాంకురం అఖిల్ పారితోషికం అక్షరాలా 10 కోట్లు అంట. అఖిల్ ను రెండు పరాజయాలు పలకరించినా, జనంలో ఆయనకి గల క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. అందువలన ఈ హ్యాండ్సమ్ హీరోకి ఆ మాత్రం ఇచ్చుకోవచ్చు అనే టాక్ కూడా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కానీ ఆ మధ్య పవన్ కల్యాణ్ .. ప్రభాస్ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేసిన భోగవల్లి ప్రసాద్, కుర్ర హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ పారితోషికం 10 కోట్లు అని తెలిసి ఆలోచనలో పడ్డారంట.
ఇప్పటికే అయన వరుణ్ తేజ్ తో 'తొలిప్రేమ' చేసిన ఆయన, శర్వానంద్ ను కూడా లైన్లో పెట్టేశారు. ఈ తరుణంలో అఖిల్ తో చేద్దామని సంప్రదిస్తే ..షాక్ గురికావడం అయన వంతైంది. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుకానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అయన అఖిల్ తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నారని సమాచారం.