YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హెచ్ సీఎ ఎన్నికలపై కేసీఆర్ గురి

హెచ్ సీఎ ఎన్నికలపై కేసీఆర్ గురి

హైద్రాబాద్,  హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ నామినేషన్ తిరస్కరించగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వివేక్ పోటీ నుంచి తప్పుకోగా ఇప్పుడు రేసులోకి ప్రకాశ్ చంద్ జైన్ ఎన్నికల బరిలోకి వచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ ప్యానెల్‌లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. అయితే కోర్టు కేసులు ఉన్నాయంటూ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో ప్రకాశ్ చంద్ మెయిన్ రూట్ లోకి వచ్చారు. హైదరబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో ఎన్నికలకు ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌, సెక్రెటరీ, ట్రెజరర్‌ పోస్టులకు ఏకంగా 72 నామినేషన్లు దాఖలయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశాడు. 226 మంది ఓటర్లున్న హెచ్‌సీఏలో ప్రధాన పోటీ వివేక్‌, అజారుద్దీన్‌ల మధ్యే అని అందరూ ఊహించారు. కానీ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో.. వార్ వన్ సైడయినట్లు అందరూ భావించారు. గత ఎన్నికల్లోనే అజారుద్దీన్‌ బరిలో ఉండగా చివర్లో ఎన్నికల అధికారి అతడిపై వేటు వేశారు. దీంతో ఈసారి ప్రకాశ్ చంద్, అజారుద్దీన్ మధ్య పోటీ నెలకొంది.ప్రెసిడెంట్‌ గా అజారుద్దీన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా విక్రమ్‌ మాన్‌ సింగ్‌, సెక్రెటరీగా అజ్మల్‌ అసద్‌, జాయింట్‌ సెక్రెటరీగా శ్రీనివాస్‌ పట్టపు, మనోహర్‌ రెడ్డి, ట్రెజరర్‌గా శ్రీనివాసరావు, ప్రకాశ్‌ రావు, కౌన్సిలర్‌గా అనురాధ నామినేషన్ లు వేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అనిల్‌ అధ్యక్షుడిగా నామినేషన్ వేయగా.. ప్రభావం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. హెచ్‌.సీ.ఏ మెంబర్‌, మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌ సపరేట్‌గా ప్యానెల్‌ పెట్టుకుని నామినేషన్‌ దాఖలు చేసేందుకు పావులు కదిపినా బుజ్జగింపులతో ఆయన పక్కకు తప్పుకున్నాడు.

Related Posts