YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ఓవర్ నైట్ స్టార్ గా మారిన గ్రెటా

ఓవర్ నైట్ స్టార్ గా మారిన గ్రెటా

న్యూఢిల్లీ,  ప్రపంచ దేశాల అధినేతలనే సూటిగా సుత్తిలేకుండా ప్రశ్నించింది. మీరు చేస్తున్నదంతా తప్పు. మీ కెంత ధైర్యం? అంటూ ఉద్వేగంగా అన్న ఆ మాటలు 16 ఏళ్ళ గ్రెటా థన్ బర్గ్ వి. ఐక్యరాజ్య సమితి వేదికగా ఆమె, వాతావరణంపై దేశాల నేతల వైఖరిని తీవ్రంగా విమర్శించింది. ఇలాగే కొనసాగితే భయంకరమైన భవిష్యత్తును చవిచూడక తప్పదని హెచ్చరించింది.  ఐక్య రాజ్యసమితి ప్రపంచ వాతావరణంపై శిఖరాగ్ర సదస్సుని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ప్రపంచ నేతలు మాట్లాడటానికి ముందు, గ్రెటా థన్ బర్గ్ మాట్లాడింది. స్కూల్లో చదువుకోవాల్సిన నేను, ఈ రోజు ఇక్కడ ఉండాల్సింది కాదు. కానీ పరిస్థితులు నన్ను ఇక్కడకు తీసుకు వచ్చాయి. మీ నేతల అర్థం లేని మాటలతో మీరు, మా కలల్ని చిదిమేస్తున్నారు. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. మీ కెంత ధైర్యం? పర్యావరణ పరిరక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? భవిష్యత్తు తరాలు మిమ్మల్ని క్షమించవు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  కొన్ని వ్యాపార ప్రకటనలు, సాంకేతిక పరిష్కారాలతో వాతావరణ సమస్యను పరిష్కరించవచ్చని అనుకోవడానికి మీ కెంత ధైర్యం? నేడు విడుదలవుతున్న ఉద్ఘారాల స్థాయిలతో...పోలిస్తే... కార్బన్ డైయాక్సైడ్ స్థాయి మరో ఎనిమిదిన్నరేళ్ళల్లో పూర్తిగా అయిపోతుంది. ఈ గణాంకాలకనుగుణంగా ఎలాంటి పరిష్కారాలు, ప్రణాళికలు మీ వద్ద ఉండవు. మీకు ఉన్నదున్నట్లుగా చెప్పే పరిపక్వత లేదు. మీరు మమ్మల్ని విఫలం చేస్తున్నారు. కానీ, నేటి యువత మీ ద్రోహాన్ని తెలుసుకుంటున్నది. మీపై భవిష్యత్ తరాల కళ్ళున్నాయి. మమ్మల్ని విఫలం చేస్తే... మేం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించబోము. మీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. అవగాహన పెరిగింది అని అన్నారు. గ్రెటా థన్ బర్గ్ ప్రసంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిదా అయ్యారు. ఓ అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న సంతోషమైన యువతిలా ఆమె కనిపిస్తుందంటూ ఆమెను చూడటం అనందంగా ఉంది. అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఇంతకీ ఎవరీ గ్రెటా... గ్రెటా థన్ బర్గ్ స్వీడన్ కి చెందిన స్కూల్ గాల్. గత కొంత కాలంగా పర్యావరణంపై ఫ్రై డేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో పోరాటం చేస్తున్నది. గతేడాది స్వీడన్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి సంచలనం చేసింది. స్కూల్ మానేసి మరీ పోరాటం చేస్తున్నది. గ్రెటాకి మద్దతుగా పలు దేశాల్లోని స్కూల్ పిల్లలు పోరాడుతున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికల మీద గ్రెటా ప్రసంగించి ఉండటం గ్రేట్. పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి వేదిక మీదుగా గళం విప్పిన గ్రెటా ఇప్పుడు టాక్ ఆఫ్ ది వాల్డ్. ఆమె ప్రసంగం విన్నవాళ్ళంతా గ్రెటా ది గ్రేట్ అంటున్నారు. మరి గ్రెటా మాటలు ది గ్రేట్ వాల్డ్ లీడర్స్ కి కూడా చేరి, మంచి పర్యావరణంతో కూడిన భవిష్యత్ ని బాలలకివ్వాలని ఆశిద్దాం.. అందులో మనమంతా భాగస్వాములమవుదాం. ఆల్ ది బెస్ట గ్రెటా రియల్లీ యు ఆర్ ది గ్రేట్.

Related Posts