కరీంనగర్, కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుకు వెళ్లే రాజీవ్ రాహదారి, కరీంనగర్ నుంచి చొప్పదండి వైపుకు వెళ్లే రాయపట్నం-వరంగల్ హైవే, కరీంనగర్ నుంచి కొత్తపల్లి వైపుకు వెళ్లే వరంగల్-జగిత్యాల ప్రధాన రహదారి, కరీంనగర్ నుంచి సిరిసిల్ల వైపుకు వెళ్లే క రీంనగర్-వేములవాడ ప్రధాన రహదారులపై వాహనాలు ఇష్టారీతిన రోడ్లపైనే నిలిపివేస్తుండటంతో ఆ రహదారుల్లో ప్రయాణీస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సరుకు లు రవాణచేసే లారీలతోపాటు లోకల్ సరుకులు రవాణ చేసే లారీలు, పెద్దపెద్ద పరిశ్రమలకు విడి భాగాలు తరలించే భారీ వాహనాలు రోడ్లపై ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ని బంధనలు పాటించకుండా డ్రైవర్లు పార్కింగ్ చేయడంతో ఈ రహదారులపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రై ల్వే వ్యాగన్స్‌లో వచ్చే బియ్యం, ఎరువులు తరలించే లారీలు, వేబ్రిడ్జిల వద్ద తూకం కోసం రోడ్డు పక్కన గంటలకొద్ది నిలపడం, కొందరు భోజనం చేసేందుకు వంటలు చేసుకోవడం, కనీస పార్కింగ్ నిబంధనలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతూ, ట్రాఫిక్ సమస్య లు తలెత్తుతున్నాయి. ఫలితంగా అత్యవసర పనుల కోసం వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికు లు చెబుతున్నారు. రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని రైల్వేస్టేషన్‌నుండి లోడింగ్, అన్‌లోడింగ్ కోసం వచ్చే లారీలు రైల్వే గేటు వద్ద రోడ్డు ప్రక్కన బారులు తీరుతుండటంతో రోడ్డు ఇ రుకుగా ఉండి చాలామంది ప్రయాణికులు అదుపుతప్పి గాయాలపాలై ఆర్ధికంగా నష్టపోయామని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. గతనెలలో తీగలగుట్టపల్లి వద్ద ఉదయం లారీలు నిలపడంతో నగునూరు నుంచి కరీంనగర్ వైపుకు వస్తున్న ఓ కారు నడిపే వ్యక్తికి ముందునుంచి వచ్చే బైక్ కనపడకపోవడంతో ఆ బైక్‌కు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే స్టేషన్ నుంచి ఎరువులు, బియ్యం బస్తాలు వేసుకొని అతివేగంగా కరీంనగర్-చొప్పదండి రోడ్డుపైకి వస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, మట్టి, గ్రానైట్ తరలించే ట్రాక్టర్లు, లారీలు, భారీ వాహనాలు అతివేగంగా వస్తుండటంతో కూడా పలు ప్రమాదాలు జరిగాయని పలు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ట్రాక్టర్ల డ్రైవర్లు మైనర్లు కావడం, దీనికితోడు అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమైన సంఘటనలు చాలా ఉన్నాయని, కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల నుండి ఇసుకను తరలిస్తున్నారని, అక్రమంగా తరలించే ఇసుకతో ఎక్కడ పట్టుబడుతామోనని వేగంగా అదరాబాదరగా నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు రోడ్డుపై నిలిపే వాహనాలపై చర్యలు తీసుకోవాని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.