Highlights
- జాన్వి మంచి డాన్సర్..
- ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది
- నా కెరీర్ తొలినాళ్లలో ప్రోత్సహించిన శ్రీదేవి
- ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్
జాన్విని శ్రీదేవితో పోల్చడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ వ్యక్తం చేశారు.జాన్వి వయసు నాటికే శ్రీదేవి సూపర్‌స్టార్ అయిపోయారని, అందువల్ల వారిద్దరి మధ్య పోలిక అవసరం లేదని ఆమె అన్నారు. శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, తన కెరీర్ తొలినాళ్లలో ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించారని ఫరా చెప్పుకొచ్చారు.
'దఢక్' చిత్రానికి ఆమె కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జాన్వి మంచి డాన్సర్ అని, తను ఏదైనా త్వరగా నేర్చేసుకుంటుందని ఆమె మెచ్చుకుంది. 'దఢక్' చిత్రానికి మరాఠీ హిట్ చిత్రం 'సైరాట్' మాతృక. హీరో షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకుడు. జూన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.