హైద్రాబాద్, హైదరాబాద్‌లో కొత్త తరహా మోసం బయటపడింది. స్కూల్స్‌ను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువతి.. ఈజీ మనీ కోసం సైబర్ నేరాల బాటపట్టింది. పలు స్కూల్స్‌కు చెందిన ఫోటోలను వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డౌన్‌లోడ్ చేస్తుంది. హైదరాబాద్‌లో కొత్త తరహా మోసం బయటపడింది. స్కూల్స్‌ను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువతి.. ఈజీ మనీ కోసం సైబర్ నేరాల బాటపట్టింది. పలు స్కూల్స్‌కు చెందిన ఫోటోలను వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డౌన్‌లోడ్ చేస్తుంది. ముఖ్యంగా మీటింగ్, ఫంక్షన్ ఫొటోలను సేకరిస్తుంది. అలా సేకరించిన వాటిని మార్ఫింగ్ చేస్తుంది. ఆ ఫోటోలను తిరిగి బాధిత పాఠశాలలకు పంపుతుంది. వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తుంది.అనంతరం ఆ స్కూల్ బాధ్యులను కలిసి.. తాను సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నానని.. మార్ఫింగ్ ఫోటోలను డిలీట్ చేస్తానంటూ డబ్బు దండుకుంటోంది. కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు బయటపడింది. నిందితురాలని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె సెల్‌ఫోన్‌లో 225 స్కూళ్ల వివరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈజీ మనీ కోసమే యువతి సైబర్ నేరాల బాటపట్టినట్టు గుర్తించారు.
కిలాడీ లేడీ మార్ఫింగ్ మోసం బట్టబయలు కావడంతో బాధితులు ఊపిరిపీల్చుకున్నారు. ఆమెని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. కిలాడీ లేడీ చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మోసపోయామని, డబ్బు కోల్పోయామని వాపోతున్నారు. కాగా, ఈ తరహా మోసం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఎంతమందిని మోసం చేసింది, ఎంత డబ్బు గుంజింది అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.ముఖ్యంగా మీటింగ్, ఫంక్షన్ ఫొటోలను సేకరిస్తుంది. అలా సేకరించిన వాటిని మార్ఫింగ్ చేస్తుంది. ఆ ఫోటోలను తిరిగి బాధిత పాఠశాలలకు పంపుతుంది..మెహిదీపట్నానికి చెందిన నేహా ఫాతిమా.. నగరంలో ప్రముఖ పాఠశాలలను ఎంచుకొని వాటి ఫేస్‌బుక్ అకౌంట్ల ద్వారా విద్యార్థుల ఫోటోలను సేకరించడం మొదలుపెట్టింది. స్కూళ్లలో సమావేశాలు, ఫంక్షన్ల సందర్భంగా పాఠశాలల యాజమాన్యం సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. పలు స్కూళ్ల వెబ్‌సైట్ల నుంచి కూడా ఫోటోలను సేకరించింది.ప్రైవేట్ స్కూల్ వెబ్‌సైట్ల నుంచి విద్యార్థినుల ఫోటోలు తీసుకున్న ఫాతిమా ఇక తనదైన శైలిలో ఆట మొదలుపెట్టింది. ఒక్కో ఫోటోను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేది. ఆ తర్వాత ఆ ఫోటోల స్కీన్ షాట్ తీసి తిరిగి అదే స్కూల్ యాజమాన్యానికి పంపించేది. ఆ ఫోటోలు చూసి షాక్ తినడం స్కూల్ మేనేజ్‌మెంట్ వంతు అయ్యేది.స్కూల్ యాజమాన్యం షాక్‌లో ఉండగానే.. ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగేది. తాను సైబర్ సెక్యూరిటీ నుంచి మాట్లాడుతున్నా అంటూ అవతలి వైపు నుంచి ఫాతిమా మాటలు కలిపేది. విద్యార్థినుల ఫోటోల విషయం ప్రస్తావించి తెలివిగా వ్యవహరించేది. ఆ ఫోటోలు తీసేస్తానని నమ్మబలికి, అందుకోసం కొంత డబ్బులు ఖర్చవుతాయని చెప్పి వసూలు చేసేది. ఫాతిమాను నిజంగానే సైబర్ సెక్యూరిటీ అధికారిణిగా భావించి స్కూల్ యాజమాన్యం మోసపోయింది.ఈ కిలేడీ లిస్ట్‌లో చాలా మంది విద్యార్థినులు ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ధనవంతుల కుమార్తెలే ఉన్నారు. పోలీసులు ఫాతిమా ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. ఆమె ఫోన్‌లో మరో 250 మంది విద్యార్థినుల ఫోటోలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ఫాతిమా ఆగడాలు రోజురోజుకూ మితిమీరడంతో స్కూల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఫాతిమాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈజీ మనీ కోసమే యువతి సైబర్ నేరాల బాటపట్టినట్టు గుర్తించారు.కిలాడీ లేడీ మార్ఫింగ్ మోసం బట్టబయలు కావడంతో బాధితులు ఊపిరిపీల్చుకున్నారు. ఆమెని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. కిలాడీ లేడీ చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మోసపోయామని, డబ్బు కోల్పోయామని వాపోతున్నారు. కాగా, ఈ తరహా మోసం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఎంతమందిని మోసం చేసింది, ఎంత డబ్బు గుంజింది అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.