YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బెల్ట్ షాపులను అరికట్టండి

బెల్ట్ షాపులను అరికట్టండి


మచిలీపట్నం సెప్టెంబర్ 26,
తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గురువారం నాడు  ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. _విస్సన్నపేట,ఏ కొండూరు 

మండలాల్లో నాటు సారా విక్రయాలు కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గంపలగూడెం,తిరువూరు మండలాల్లో బెల్ట్ దుకాణాలు విక్రయాలు నిర్వహణపై కుడా అయన మండిపడ్డారు. 

సీఎం వైఎస్ జగన్ నాటుసారా తయారీ, బెల్ట్ దుకాణాలపై విషయంలో కఠినంగా ఉన్నారని తదనుగుణంగా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించాలి. వచ్చే నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం మద్యం 

దుకాణాల్ని నడపనున్నాయి.. వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. _తిరువూరు నియోజకవర్గంలో ప్రత్యేక దాడులు చేసైనా.. బెల్ట్, సారా విక్రయాలపై ఉక్కుపాదం 

మొపండి. _వైన్ షాప్స్ లలో ఎంఆర్పి ధరలకే విక్రయాలు జరగాలి. ఉల్లంఘనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విస్సన్నపేట ఎక్సైజ్ స్టేషన్లో సిబ్బంది 

కొరతపై సంబంధిత మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. రెస్టారెంట్ లలో మద్యం విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలి.తమ శాఖలో ఎదుర్కొంటున్నా 

సమస్యలు నిర్భయంగా తెలపండి..మీకు అండగా నేనుంటానని అధికారులకు మాటిచ్చారు.

Related Posts