పచ్చదనాన్ని పెంపొందించాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ సెప్టెంబర్ 26,
తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమంలా హరిత హరమ్ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున హరిత హరమ్ కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఏది లెదని మంత్రి కొప్పుల
ఈశ్వర్ అన్నారు. గురువారం నాడు అయన హరితహారం కార్యక్రమంలో పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ 150 కోట్ల మొక్కలని నాటి రికార్డ్ సృష్టించాం. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు
చేస్తున్నాం . విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెంటిల్ హై స్కూల్లో 200 మొక్కలని నాటడం జరిగింది. ప్రతీ గ్రామానికి మొక్కలని నాటడంలో టార్గెట్ ఇచ్చాం. ప్రతీ ఒక్కరు మొక్కల్ని
నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. మంచి పర్యావరణాన్ని , ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో భాగంగానే ఈ కార్యక్రమాని చేస్తున్నామని మంత్రి అన్నారు.