షార్ట్ సర్క్యూట్ తో బట్టల దుకాణం దగ్ధం
- లక్షల్లో ఆస్తి నష్టం
- కాలి బుడిదైన దుస్తులు, ఫర్నీచర్
ఎమ్మిగనూరు సెప్టెంబర్ 26,
పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ లోని శ్రీలక్ష్మీ సిల్క్ హౌస్ దుకాణంలో బుదవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగ
దుకాణంలో నుండి పొగలు రావడంతో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు గమనించి షాప్ యజమానికి సమాచారం అందించి, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే
స్పందించి అగ్నిమాపక శాఖ ఎస్సై మోహన్ అద్వర్యంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి భారీ అగ్ని ప్రమాదం ముప్పును తప్పించారు.దాదాపు గంటన్నర పాటు శ్రమించి
మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలో ఉన్న విలువైన వస్త్రాలు, ఫర్నీచర్ కాలి బూడిద కావడంతో సుమారు రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు
పేర్కొన్నాడు.తమను అన్నివిధాల ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ సంఘటనా స్థలాన్ని పోలీసులు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వి.శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.