వర్షాల తగ్గుముఖంతో గ్రేటర్ లో సీజనల్ వ్యాధుల నివారణపై బల్దియా అలర్ట్
రంగంలోకి 642 ఎంటమాలజి టీంలు, 163 ఫాగింగ్ టీంలు
హైదరాబాద్,సెప్టెంబర్ 26,
లార్వా నివారణ చర్యలు, గంబూసియా చేపల విడుదల, నీటి నిల్వలను తొలగించడం, వ్యాధులు తరచుగా ప్రబలే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, అంటువ్యాధుల నివారణపై పెద్ద ఎత్తున ప్రచార
కార్యక్రమాల నిర్వహణ తదితర చర్యలను గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎంటమాలజి, శానిటేషన్, హెల్త్ విభాగాలు విస్తృతంగా చేపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మూడు
రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసి తగ్గుముఖం పడిన నేపథ్యంలో నగరంలో ఎంటమాలజి విభాగం ద్వారా చేపట్టాల్సిన ఫాగింగ్, స్ప్రేయింగ్ తదితర కార్యక్రమాలపై
జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల తిరిగి దోమలు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలల్లో యుద్ద ప్రాతిపదికపై
యాంటి లార్వా స్ర్పేయింగ్ చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ మాసం వరకు డెంగ్యు, మలేరియా, చికెన్‌గున్య తదితర అంటు వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉన్నందున వీటి
br>నివారణకునగరవాసుల్లో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను జిహెచ్ఎంసి చేపట్టింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగంలో ఉన్న 2,375 మంది సిబ్బంది లార్వా
నివారణ చర్యలు, కాలుష్య నివారణ చర్యల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
లార్వా నివారణ చర్యలు
నగరంలో ప్రతిరోజు దాదాపు లక్ష గృహాలను పరిశీలించి వీటిలో దోమల ఉత్పత్తి కేంద్రాలలో, గతంలో డెంగ్యు, మలేరియా కేసులు నమోదైన బస్తీల్లో ముందస్తుగా పెరిత్రియం స్ప్రేను
మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. తరచుగా మలేరియా, డెంగ్యు వ్యాధులు నమోదు అయ్యే ప్రాంతాలైన హయత్‌నగర్,మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, చార్మినార్,
రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, అంబర్‌పేట్, మూసాపేట్, కుత్బుల్లాపూర్ తదితర సర్కిళ్లపై ప్‌డత్యేక దృష్టి సాధించి విస్తృత స్థాయిలో మస్కిటో నివారక స్ప్రేయింగ్ చేపట్టడంతో
పాటు నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, సంపులు, నల్లా గుంతలతో పాటు డ్రమ్‌లు, డబ్బాలు, కుండలు, టైర్లలో నీటి నిల్
లను పూర్తిగా తొలగించాలని అన్నారు. నవంబర్ మాసాంతం వరకు నిరంతరం లార్వా నివారణ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు నీటి నిల్వలు, అపరిశుభ్ర పరిసరాల వల్ల దోమల వ్యాప్తి
ఏవిధంగా జరుగుతుందో తెలియజేసే చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. అంటు వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నగరంలోని 1800
పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టామని, వీటిని నిరంతరం నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం వద్ద
ప్రతి మున్సిపల్ వార్డుకు ఒకటి చొప్పున ఉన్న 150 పోర్టబుల్, ప్రతి జోన్ కు రెండు చొప్పు ఉన్న వాహనాలకు అమర్చిన 13 ఫాంగింగ్ మిషన్లు, ప్రతి యాంటి లార్వా ఆపరేషన్
బృందాలకు ఒకటి చొప్పున ఉన్న 668 నాప్ సాక్ స్ప్రేయర్లు, ప్రతి సర్కిల్ కు ఒకటి చొప్పున ఉన్న 30 పవర్ స్ప్రేయర్ల ద్వారా ప్రతిరోజు కనీసం 150 కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్
మరో సారి నిర్వహించనున్నారు. మై జీహెచ్ఎంసి యాప్, డయల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంటర్, ఇ-మెయిల్, వాట్సప్ తదితర మాద్యమాల ద్వారా దోమల బెడద, అంటువ్యాధుల
పై అందే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి తగు చర్యలను చేపట్టడం, . దోమల నివారణపై నగరవాసులను చైతన్యపర్చడానికి ప్రచార సాధనాలైన ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు,
రేడియో, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. టౌన్‌లేవల్ ఫెడరేషన్లు, స్లమ్‌లేవల్ ఫెడరేషన్లు, మహిళా స్వయం
సహాయక బృందాలు, కాలనీ సంక్షేమ సంఘాలను కూడా ఈ చైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.