YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నగరం...నరకమేనా...ప్రత్యామ్నాయా మార్గాలు లేవా

నగరం...నరకమేనా...ప్రత్యామ్నాయా మార్గాలు లేవా

నగరం...నరకమేనా...ప్రత్యామ్నాయా మార్గాలు లేవా
హైద్రాబాద్,
ముంబై, చెన్నై నగరాలతోపాటు హైదరాబాద్లో కూడా రెయిన్‍ వాటర్‍ బయటకు పోయేందుకు, భూమిలోకి ఇంకేందుకు సరైన ఏర్పాట్లు లేనట్లు అనేక సంస్థల సర్వేలో తేలింది. దీంతో వానొస్తే సిటీలో రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. ఏటా ఇదే తంతు. అయినా పాలకుల్లో ముందుచూపు కనిపించట్లేదు. జీహెచ్‍ఎంసీ, హెచ్‍ఎండీఏలు ఉన్నా నగరంలో సరైన మాస్టర్‍ ప్లాన్‍ అమలుచేయలేకపోవడంతో సర్కారు సామర్థ్యంపై డౌట్లు వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేట్లు ఉంది.60 ఏళ్ల క్రితం నిజాం పాలకులు హైదరాబాద్లో రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ని చక్కగా చేపట్టారు. నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి పోయేందుకు రోడ్ల పక్కన డ్రెయిన్లు కట్టించారు. తర్వాత నగరం అభివృద్ధి చెందింది. రోడ్లు విస్తరించాయి. దీంతో డ్రెయిన్‍ వాటర్‍ లైన్లు కనుమరుగయ్యాయి. డెవలప్మెంట్ పేరుతో అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు వెలిశాయి. వాటిలోనైనా వాటర్‍ హార్వెస్టింగ్‍ పాయింట్లు కనిపిస్తే ఒట్టు. రోడ్ల పక్కన కనీసం ఇంకుడు గుంతలు తవ్వించే ప్లాన్ కూడా జీహెచ్‍ఎంసీ వద్ద లేనట్లు అనిపిస్తోంది.నీరు నిలిచే చోట ఇంకుడు గుంతలు, డ్రెయిన్లు మచ్చుకైనా కన్పించవు. ఒకటీ రెండు చోట్ల ఉన్నా మెయింటనెన్స్ కరువై వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరట్లేదు. దీనికితోడు పాలకుల నిర్లక్ష్యం మూలంగా మొత్తం వాన నీటి వ్యవస్థ పాడైపోయింది. దీనికి ప్రభుత్వం, అధికారులతోపాటు ప్రజలు కూడా బాధ్యత వహించాలి. ఆ రోజుల్లో హైదరాబాద్‍ చుట్టుపక్కల ఎన్నో చెరువులు ఉండేవి. అవి చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. దీంతో కొన్నాళ్లకు ‘నగరంలో ఒకప్పుడు చెరువులు ఉండేవి’ అని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది.సిటీలోని పెద్ద పెద్ద చెరువులన్నింటినీ బడాబాబులు ఎప్పుడో ఆక్రమించేశారు. కొన్ని చోట్ల ఇళ్లు, మరికొన్ని చోట్ల కంపెనీలు కట్టేశారు. దీంతో చెరువులు నిండినప్పుడల్లా అపార్ట్మెంట్లు, కాలనీలు వాన నీటితో వాటర్ బాడీలను గుర్తుకు తెస్తున్నాయి. లేక్‍ ఫ్రంట్/లేక్వ్యూ అని చెప్పగానే ఆలోచించకుండా లక్షల రూపాయలు పెట్టి ఇళ్లు కొంటున్నారు. కానీ రూల్స్ పట్ల కనీస అవగాహన పెంచుకోవట్లేదు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ జనం ప్రభుత్వాలను నిందిస్తున్నారు.ఒకప్పుడు మూసీలో మంచి నీళ్లు పారేవి. ఇప్పుడు ఆ నది పేరు వింటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. పాత బస్తీతోపాటు కొత్త కాలనీల్లోని డ్రైనేజీ లైన్లన్నీ మూసీలోకే దారితీస్తున్నాయి. ఆ నదీ ప్రాంతాన్ని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది. గతంలో మూసీ ఒడ్డున ఎంజీబీఎస్‍ కట్టడమే తప్పు అనుకుంటే ఇప్పుడు మెట్రో స్టేషన్ని ఏకంగా నది మధ్య భాగంలోనే నిర్మించారు. చాదర్‍ఘాట్‍ బ్రిడ్జికి రెండు వైపులా దాదాపు 60 శాతం నీటి కాలువలోనే కాలనీలు పుట్టుకొచ్చాయి.నది ఒడ్డున ఇళ్లు కట్టేటప్పుడు ఆఫీసర్లు, లీడర్లు ఏం చేశారో అర్థంకావట్లేదు. ఇప్పటికైనా వేరే చోట పునరావాసం కల్పించి స్థానికులను అక్కడికి తరలించేందుకు చర్యలు చేపట్టాలి. చెరువుల్లోకి వాన నీటిని తెచ్చే కాలువలను కాపాడేందుకు గవర్నమెంట్ జీవో నంబర్–111ని తెచ్చింది. ఈమధ్య ఆ జీవోలో మార్పులు చేర్పులు చేస్తామని చెబుతోంది. ఇదే జరిగితే హైదరాబాద్ ప్రజలకు వాన నీటి కష్టాలు రెట్టింపవుతాయి. 1908లో మూసీ వరద కారణంగా చోటుచేసుకున్న ఛేదు జ్ఞాపకాలు మళ్లీ వెంటాడకుండా ఉండాలంటే పాలకులు కళ్లు తెరవాలి.హైదరాబాద్లో ఇప్పట్లాగే గత 111 ఏళ్లలో 6 సార్లు మాత్రమే పెద్ద వానొచ్చింది. ప్రాబ్లం రెగ్యులర్గా రాకపోవడంతో వచ్చినప్పుడే ప్రభుత్వం, ఆఫీసర్లు హడావుడి చేసి తర్వాత మర్చిపోతున్నారు. అంతేతప్ప లాంగ్టర్మ్ ప్లాన్లు అమలుచేయట్లేదు. సిటీలోని డ్రైనేజీ సమస్యలో సీవరేజ్ సిస్టమ్ పెద్దది. నార్త్ జోన్తో పోల్చితే ఇబ్బందులు ఉన్న ఏరియాలు సౌత్ జోన్లోనే ఎక్కువ. గతంలో ఏర్పాటుచేసిన డ్రైనేజీ వ్యవస్థ 5 లక్షల జనాభాకే సరిపోతుంది. అది ప్రస్తుతం దాదాపు 90 లక్షలకు చేరింది. అందుకే ఈ కష్టాలు. నగరంలో వరద నీటి వ్యవస్థ సరిగా లేదు. వాస్తవానికి వరద నీటి వ్యవస్థ, సీవరేజ్ వాటర్ సిస్టం వేర్వేరుగా ఉండాలి. ప్రస్తుతం రెండూ ఒకే వ్యవస్థగా మారాయి. దీంతో కెపాసిటీ సరిపోవట్లేదు. వరద నీటి కాలువల పక్కన ఉన్న స్థలాలు చాలా వరకూ కబ్జా అయ్యాయి. ఒకప్పుడు ఈ సిస్టమ్ కోసం చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. దీంతో ఆ స్థలాల్లో నీరు ఇంకేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందువల్ల కబ్జాకు గురైన స్థలాలను ప్రభుత్వం వెంటనే ఖాళీ చేయించాలి.దేశంలో హైదరాబాద్కి ప్రత్యేక స్థానం ఉంది. వివిధ దేశాల ప్రజలకు జియోగ్రాఫికల్గా, క్లైమేట్పరంగా ఈ భాగ్య నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే పేరొచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రాజధానిని దేశానికి రెండో రాజధానిగా చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి ప్రమాదాలు జరగని ఎత్తైన ప్రాంతంలో హైదరాబాద్‌ ఉంది. ఇలాంటి సేఫ్ సిటీలో విపత్తులను  మనకు మనమే కొనితెచ్చుకుంటున్నాం.నిజానికి ఈ విశ్వ నగరంలో మురుగు నీరు, వర్షపు నీరు విడివిడిగా ప్రవహించేలా ఏర్పాట్లు ఉండాలి. పెరిగే పాపులేషన్కి అనుగుణంగా డ్రైనేజీ సిస్టమ్ని పటిష్టంగా నిర్మించాలి. కానీ.. ఇవన్నీ లేకుండా ఎవరి అవసరాలకు తగ్గట్గు వాళ్లు ఇళ్లు కట్టుకోవడంతో నగరం నరకంలా మారింది. డ్రైనేజీలు, చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా స్వాహా చేశారు. చిన్నపాటి వానకే విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. నీళ్లు రోడ్లపై నిలవటంతో గుంతలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా నగరం నిలువునా జలమయమవుతోంది.వర్షపు నీటిని ప్రత్యేక పైపు లైన్ల ద్వారా చెరువుల్లోకి, కుంటల్లోకి తరలిస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మనకు నీళ్లు కావాలన్నప్పుడు, ఎండా కాలంలో వానలు పడవు. అవి వచ్చినప్పుడే నీటిని నిల్వచేసుకోవాలి. ఆ కెపాసిటీ గ్రేటర్‌ హైదరాబాద్‌లో లేకపోవడంతో రోడ్లన్నీ చెరువులుగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే వాటర్ స్టోరేజీ ఏర్పాట్లను ఇప్పటికైనా పెద్దఎత్తున ప్రారంభించటం మంచిది. ముంపు ముప్పు తప్పాలన్నా ఇవి తప్పనిసరి.సిటీలో ఒకప్పుడు సుమారు 1,000 చెరువులు ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా ఒక్కటి కనిపించట్లేదు. బోయిన్‌పల్లిలో చెరువు చుట్టూ ఇళ్లు కట్టారు. దీంతో వర్షపు నీళ్లు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, హైటెక్‌ సిటీ వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఎక్కడికి పోవాలి. వాస్తవానికి అక్కడే ఉన్న దుర్గం చెరువులోకి వెళ్లాలి. కానీ ఇప్పుడు ఆ చెరువులోకి నీళ్లు పోయే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరుతోంది. నేలను సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయడంతో నీళ్లు ఇంకే ఛాన్స్ లేకుండాపోతోంది.గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో హైదరాబాద్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. 2007లో అప్పటి ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది. ఇంకుడు గుంతలు లేని ఇంటికి నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. కానీ.. పొలిటికల్ లీడర్లు స్వార్థంతో ఇంకుడు గుంతలు లేకున్నా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చేందుకు లోపాయికారిగా సహకరించారు. దీంతో ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం ఫెయిలయ్యే పరిస్థితి వచ్చింది. అయిపోయిందేదో అయిపోయింది. ఇకనుంచైనా ఇంకుడు గుంతల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నగరంలో ఎక్కడి వర్షపు నీళ్లు అక్కడే ఇంకిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి చర్యలతోనే నగరాన్ని రక్షించుకోవచ్చు. వాన నీటి ఇబ్బందులను తొలగించుకోవచ్చు

Related Posts