YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పదో తరగతి క్వశ్చన్ పేపర్ లో మార్పులు

పదో తరగతి క్వశ్చన్ పేపర్ లో మార్పులు

పదో తరగతి క్వశ్చన్ పేపర్ లో మార్పులు
విజయవాడ,
ఆంధప్రదేశ్‌లో పదోతరగతి వార్షిక పరీక్షల క్వశ్చన్ పేపర్‌లో మార్పులకు పాఠశాల విద్యాశాఖ పంపిన బ్లూప్రింట్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. కొత్తగా రూపొందించిన నమూనా ప్రకారం పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను పూర్తిగా తొలగించనున్నారు. దీనికి బదులుగా ప్రశ్నపత్రంలోనే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. వీటిని నేరుగా క్వశ్చన్ పేపర్‌లోనే ఇస్తారు. వీటిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఖాళీలు, జతపర్చడం లాంటివి ఉంటాయి. వీటికి విద్యార్థులు జవాబు పత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది.పదోతరగతి విద్యార్థులకు ఇప్పటికే ఇంటర్నర్ మార్కులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టులోనూ 20 ఇంటర్నల్ మార్కులు ఉండేవి. 80 మార్కులకే ప్రశ్నపత్రం ఉండేది.. తాజాగా ఇంటర్నల్ మాార్కులను ఎత్తివేయడంతో.. ఒక్కో సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకూ రాతపరీక్షే నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే హిందీ మినహా ప్రతి సబ్జెక్టులోనూ రెండు పేపర్లు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 18 పేజీల బుక్‌లెట్లను ఇవ్వనున్నారు. విడిగా అడిషనల్ షీట్లను ఇచ్చే విధానం ఇకపై ఉండదు.
కొత్త ప్రశ్నపత్రం ఇలా...
➤ ఎప్పటిలాగే పరీక్షలో మొత్తం 11 పేపర్లు ఉంటాయి. వీటిలో హిందీకి మాత్రం ఒక పేపరు, మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి.
➤ ఒక్కో ప్రశ్నపత్రానికి 50 మార్కులు ఉంటాయి.
➤ పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను ఎత్తివేయడంతో... దీనికి బదులుగా ప్రశ్నపత్రంలోనే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వనున్నారు.
➤ మొత్తం నాలుగు విభాగాలుగా పదోతరగతి ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. వీటిలో ప్రతి పేపరులోనూ 12 అర మార్కు ప్రశ్నలు (6 మార్కులు), 8 ఒకమార్కు ప్రశ్నలు (8 మార్కులు), 8 రెండు మార్కుల ప్రశ్నలు (16 మార్కులు), 5 నాలుగు మార్కుల ప్రశ్నలు (20 మార్కులు) ఇవ్వనున్నారు.
➤ ఇప్పటి వరకు రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా ప్రకటించే వారు.. అయితే మారిన విధానం ప్రకారం రెండు పేపర్లలోనూ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఒక్కో పేపరులో కనీసం 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లుగా గుర్తిస్తారు.

Related Posts