YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సుక్మా పేలుళ్ల మృతులకు హోం మంత్రి సంతాపం

Highlights

  •  ప్రతీకార దాడులకు తెగబడ్డ మావోయిస్టులు
  • ప్రాణాలను కోల్పోయిన  కుటుంబాలకు సానుభూతి 
  • గాయపడిన జవాన్లు త్వరగాకోల్కోవాలి 
  • దేవుడిని ప్రార్ధించిన రాజాలాద్ సింగ్ 
 సుక్మా పేలుళ్ల మృతులకు హోం మంత్రి సంతాపం

మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడ్డారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చి జవాన్ల ప్రాణాలు తీశారు. మంగళవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఆ తర్వాత కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 9 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ మృతిని కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. గాయపడిన జవాన్లు త్వరగా కోల్కోవాలని దేవుడ్ని ప్రార్ధించారు. 

Related Posts