Highlights
- ప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణం..?
- భయాందోళనలకు గురవుతోన్న రోగులు, వారి బంధువులు
- మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తోన్న అగ్నిమాపక సిబ్బంది
తెలంగాణ రాష్ట్ర రాజధానికి చెందిన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. దీనితో ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, వారి బంధువులు భయాందోళనలకు గురయ్యారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణమా? అన్నట్టుగా ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంటుంది.