YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మానవహక్కుల కమిషన్లను నియమించాలి  -  ఐహెచ్ఆర్ఏ ఏపి డైరెక్టర్ కరణం తిరుపతినాయుడు

మానవహక్కుల కమిషన్లను నియమించాలి  -  ఐహెచ్ఆర్ఏ ఏపి డైరెక్టర్ కరణం తిరుపతినాయుడు

మానవహక్కుల కమిషన్లను నియమించాలి  -  ఐహెచ్ఆర్ఏ ఏపి డైరెక్టర్ కరణం తిరుపతినాయుడు
హైదరాబాద్ 
ఆంధ్రప్రదేశ్ పున విబజన చట్టం -2014 షెడ్యూల్ 10 ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లను నియమించాలని ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతినాయుడు నేడోక ప్రకటన డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ల చైర్మెన్ , సబ్యుల పదవులు సుమారు 5 సం.ల నుండి ఖాళిగా ఉన్నాయని దీనితో  మానవ హక్కుల ఉల్లంఘనలపై వేలాది ఫిర్యాదులు పరిష్కారం కాకుండా భాదితులు తమ హక్కులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జిస్టిస్ కక్రు అద్వర్యంలో 2016డిసెంబర్  వరకు మాత్రమే కమీషన్ కార్యకలాపాలు అరకొరగా కొనసాగాయని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో చాలా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలో లోకాయుక్త, సమాచార హక్కు కమీషన్ చైర్ పర్సన్, సభ్యుల నియామకం,వృద్దుల సంక్షేమ ట్రిబ్యునల్ లలో పోస్టులను కూడా భర్తీ చేయడంలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలకు హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి మావన హక్కుల కమిషన్ లో వేలాది ఫిర్యాదులపై విచారణ లేకుండా నిర్జీవంగా ఉన్నాయని రెండు రాష్టారలలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు వస్తున్న ఫిర్యాదులు నమోదు చేయడానికి సరైన సిబ్బంది కూడా లేరని అయిన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కీవలం రాజకీయాలకే పరిమితమైనాయని తిరుపతి నాయుడు ఆరోపించారు.దీనితో ఆయా సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా తవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.వెంటనే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మానవ హక్కుల కమిషన్ ను నియమించాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.ఎట్టి విషయమై త్వరలో రస్త్రాపతికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Related Posts