సీబీఐలో అంతర్యుద్ధం...జేడీపై డీఎస్పీ సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ
సీబీఐలో నాటి డైరెక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాల మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరిగి ఏడాది కూడా గడవక ముందే మరోసారి రగడ మొదలైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే భట్నాగర్‌పై నకలీ ఎన్‌కౌంటర్లు, అవినీతి అరోపణలు చేస్తూ డీఎస్పీ ఎన్‌పీ మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) లేఖ రాశారు.జార్ఖండ్‌లో 14 మంది అమాయకులను నకిలీ
ఎన్‌కౌంటర్ చేయడంలో ఆయన ప్రమేయం ఉంది. సీబీఐ నుంచి భట్నాగర్‌ను తప్పించకపోతే సంస్థ దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. నకిలీ ఎన్‌కౌంటర్‌లలో ఆప్తులను కోల్పోయిన వారంతా సీబీఐ పదవిలో భట్నాగర్ ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని డీఎస్పీ తన లేఖలో పేర్కొన్నారు.పలు అవినీతి వ్యవహారాల్లో కూడా భట్నాగర్ హస్తం
ఉందనీ... జాయింట్ డైరెక్టర్ అక్రమాలపై పలువురు వ్యక్తులు వివిధ సందర్భాల్లో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో తన బదిలీ కేసును వాయిదా వేయించుకునేందుకు భట్నాగర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మిశ్రా ఆరోపించారు. కేసుల వల్ల తన పేరు బయటికి పొక్కుతుందన్న భయంతో సాధ్యమైనంత
వేగంగా వాటిని విచారించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశార ని మిశ్రా లేఖలో చెప్పుకొచ్చారు. గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టు ఉమేశ్ రాజ్‌పుత్ హత్యకేసులో ముగ్గురు సీనియర్ అధికారులు ఆధారాలను మాయం చేసి, అవినీతికి పాల్పడ్డారన్నారు.