YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ప్రభుత్వం నిర్వహించాలని కర పత్రాలు విడుదల 

అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ప్రభుత్వం నిర్వహించాలని కర పత్రాలు విడుదల 

అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ప్రభుత్వం నిర్వహించాలని కర పత్రాలు విడుదల 
నంద్యాల
శుక్రవారం నాడు స్థానిక బొజ్జా థశరథ  రామిరెడ్డి ఇంటి యందు రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ వై యన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ  అధికారికంగా అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రభుత్వం నిర్వహించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని 
అక్టోబర్ 1,1953 సాధించుకున్న విషయం విదితమే.భారతదేశంలో ప్రప్రధమంగా భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు  ఇది నాంది.తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 3 సంవత్సరాలు కొనసాగింది.అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుండి 2014 లో విడిపోవడంతో 1953 లో సాధించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నది.  ఈ నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న జరుపుకోవాల్సిన ప్రాధాన్యత ఏర్పడింది.శ్రీబాగ్ ఒడంబడిక నేపద్యంలో మరియు పొట్టి శ్రీరాముల ఆత్మ త్యాగ ఫలితం తో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న ప్రభుత్వం నిర్వహించేలా కృషి  చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. ఏది ఏమైనా మేము నంద్యాల లో సంజీవనగర్ జంక్షన్, శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అక్టోబరు 1 న జాతీయ జెండా ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నా మని అన్నారు .ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నామని అన్నారు.  ఈ సందర్భంగా రాయలసీమ 
సాగునీటి సాధన సమితి కార్యాలయం నందు. శుక్రవారం  కరపత్రాలను విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ వై యన్ .రెడ్డి, యేర్వ రామచంద్రారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, యమ్ వి . రమణారెడ్డి, నారాయణ రెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related Posts