YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తప్పుడు రికార్డులతో నిందలు  - చంద్రబాబు నాయుడు

తప్పుడు రికార్డులతో నిందలు  - చంద్రబాబు నాయుడు

తప్పుడు రికార్డులతో నిందలు  - చంద్రబాబు నాయుడు
గుంటూరు
 పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాల అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు.  గుంటూరులో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తోందన్నారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు.  పీపీఏలపై అనవసరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రానికి రూ.7500 కోట్ల నష్టం అని అయన విమర్శించారు. 
తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ రంగానికి 149 అవార్డులు వచ్చాయని అన్నారు. 2009కి ముందు తప్పుడు నిర్ణయాలతో కరెంట్ రూ.11లకు కొనుగోలు చేశారన్నారు. రూ.20వేల కోట్ల అప్పులు ఇంక చెల్లించాల్సి ఉందని ఈ ప్రభుత్వం చెబుతోందన్నారు. గతంలో సర్ ఛార్జి కూడా వడ్డించే పరిస్థితి తీసుకొచ్చారన్నారు.విద్యుత్ రంగంలోమొదట సంస్కరణలు తీసుకొచ్చింది తామేనని చంద్రబాబు  అన్నారు .టీడీపీ హయంలో జెన్కో, ట్రాన్స్కోను దేశంలోనే నెంబర్ వన్ చేశామన్నారు. సంస్కరణలతో కరెంట్ 
కోతలను అధిగమించామన్నారు. డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు.

Related Posts