ఈ రోడ్డు నిర్మాణం ప్రత్యేక ప్రణాళికలు వర్తించదా
గోపాల్ పేట
గోపాల్ పేట బస్టాండ్ కు అతి సమీపంలో ఉన్న చాకల్ పల్లి వెళ్లే బురద మయమైన మట్టి రోడ్డు నిర్మాణం 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి వర్తించదాంటూ ప్రజలు ప్రశ్నించ సాగారు. ఈ రోడ్డు నిర్మాణం పై ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలకు ,ప్రయాణికులకు నరక యాతన గా మారింది. వర్షం పడింది అంటే చాలు రోడ్డు
బురదమయమయి గుంతల్లో నీరు నిలిచి వచ్చి పోయే వారికి తీవ్ర అసౌకర్యాలను కలిగిస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పై ఎన్నో పత్రికలలో, ఎన్నో రకాల శీర్షికలతో వార్తలు వచ్చినా కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం విచారకరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డు బురదమయమయి, నీళ్లు నిలిచి నడవటానికి నరకయాతనగా
మారి వచ్చి పోయే వాహనాల వలన బురద నీరు రోడ్డుకు ఇరుప్రక్కల నిలిచిన వారిపై పడుతున్నాయి. అలాగే ద్విచక్ర వాహన దారులు ఈ రోడ్డుపై ప్రయత్నిస్తూ జారిపడి పోవడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనైనా ఈ రోడ్డు నిర్మాణం ప్రత్యేక ప్రణాళికల కార్యక్రమంలో చేపట్టి ప్రజలకు, ప్రయాణికులకు, వాహనదారులకు సౌకర్య కలిగించాలని వారు కోరుతున్నారు.