ఉత్తమ్ పై మండపడ్డ కర్నే
హైదరాబాద్
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం అయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ బచ్చా అని ఉత్తమ్ మాట్లాడుతున్నారని.. అలాగైతే రాహుల్ గాంధీ కూడా బచ్చాని ఉత్తమ్ భావిస్తున్నారా అని ఉత్తమ్ ను ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాల్లో కొనసాగనని ఉత్తమ్ మాట్లాడలేదా?, కుటుంబ పాలన అంటూ విమర్శలు చేసే ఉత్తమ్...హుజూర్నగర్లో ఆయన భార్యను ఎలా పోటీకి పెట్టారఅని ప్రశ్నించారు. కోదాడలో ఆయన భార్య ఓడిపోగానే హుజూర్ నగర్ లో పోటీకి పెట్టిండు. కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ చెల్లుతుందా?, ఎన్నికకు ముందే ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. రాజకీయాల్లో సిన్సీయార్టి తప్ప సీనియార్టి ఉండకూడదు. రాజకీయాల్లో వయసుతో పని ఉండదు. నిబద్ధతతో పని చేసే వ్యక్తివి అయితే మాట మీద నిలబడాలని అయన అన్నారు. ఉత్తమ్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేయించినా నూటికి నూరు శాతం తెరాస గెలుస్తుందని అన్నారు.