ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో చట్టసభల నిర్వహణ
కంపాల (ఉగాండా )
ప్రజాప్రతినిధులు చట్టసభలలో మరింత మెరుగైన పనితీరు కనబరచడానికి ఆధునిక శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో జరిగిన "నేటి రోజులలో చట్టసభల నిర్వాహణలో శాస్త్ర
మరియు సాంకేతిక అంశాల ప్రభావం" అంశంపై ప్రతినిధులను ఉద్యేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ మారిన పరిస్థితులలో శాస్త్ర, సాంకేతికత ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచం ఒక డిజిటలైజేషన్ గా మారిందన్నారు. నేడు సామాన్య ప్రజలు అన్ని రంగాలతో పాటుగా చట్టసభలలో కూడా ఖచ్చితత్వం, సమర్ధత, నైపుణ్యం, పారదర్శకత కోరుకుంటున్నారు.
మారుతున్న కాలానుగుణంగా నేటి ఆధునిక యుగంలో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు కూడా ఆధునిక శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. చట్టసభల ప్రతినిధులు ఆధునిక పరిజ్ఞానం సహాయంతో తమ తోటి సభ్యులతో మెరుగైన సంభాషణలు ఏర్పర్చుకోవడంతో పాటు, తమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో సమాచార పరిదిని పంచుకుంటున్నారు.
సామాన్య ప్రజలు తమ వినతులను గౌరవ చట్టసభల ప్రతినిధులకు చేరవేయడానికి ఇ-మేయిల్ సాంకేతికంగా ఉపయోగపడుతుంది. పార్లమెంట్ కమిటీలు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా ప్రయాణ సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోగలుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ లలో ఓటింగ్ ను జరపడం ద్వారా సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఖచ్చితత్వం మరింత మెరుగవుతుంది. అయితే మెరుగైన ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తేవడం ఖర్చుతో కూడుకున్న అంశం. అంతేకాకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ విదానాలను మార్చవలసిన అవసరం ఉంటుందని అయన అన్నారు.