ఆత్మకూరులో పోషణ్ అభియాన్
కర్నూలు
కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కాపు కల్యాణ మండపం లో పోషణ అభియాన్ మసోత్సవాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సమాచార శాఖ ఉపసంచాలకులు పి.తిమ్మప్ప, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు శివహరి నాయక్.
పాల్గొన్న సీడీపీఓ లావణ్య, మెడికల్ ఆఫీసర్లు డా.గోపాల్, డా. భాస్కర్, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, విద్యార్థినిలు పాల్గోన్నారు. తిమ్మప్ప మాట్లాడుతూ మహిళలు, నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తో అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. మహిళలు, విద్యార్థిని లు సమతుల పోషకాహారాన్ని తీసుకుని..రక్తహీనత సమస్య రాకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అక్టోబర్ 10 నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాని పాఠశాల విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. *అనంతరం, పోషణ అభియాన్, నవరత్నాలు పథకాలను మహిళలకు వివరించి, వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినులు, మహిళలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా బహుమతులను ప్రధానం చేసారు.