YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అన్యాయం జరిగిన వారిని గుర్తించి పోస్టింగ్లు ఇస్తాం  -  హోంశాఖ మంత్రి హామీ

అన్యాయం జరిగిన వారిని గుర్తించి పోస్టింగ్లు ఇస్తాం  -  హోంశాఖ మంత్రి హామీ

అన్యాయం జరిగిన వారిని గుర్తించి పోస్టింగ్లు ఇస్తాం  -  హోంశాఖ మంత్రి హామీ
హైదరాబాద్
లాస్ట్ కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు వివరాలతో సహా జాబితా ఇస్తే విచారణ జరిపి పోస్టింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని హోం మంత్రి మహమ్ముద్  అలీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క మెరిట్ అభ్యర్థికి, రిజర్వేషన్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. అలాగే ఫీజు విషయంలో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి తగ్గించే ప్రయత్నం 
చేస్తామని మంత్రి  హామీ ఇచ్చారు.పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన 16025 పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయని, నీటిని సరిదిద్ది అన్యాయం జరిగిన వారిని గుర్తించి పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ నేడు హోంశాఖ మంత్రి తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో గుజ్జ 
కృష్ణ, నీల వెంకటేష్, టీ.నందగోపాల్, భూపేష్ సాగర్ తదితరులు ఉన్నారు. లాస్ట్ కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికీ ఉద్యోగాలు రాలేదు, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.పొలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించిన  న కటాఫ్ మార్క్స్ ప్రకారం అభ్యర్థుల మార్కులు లెక్కిస్తే చేస్తే ఎక్కువ మార్కులు వచ్చిన వందలాది మంది 
అభ్యర్థులు  సెలెక్ట్ కాలేదు. ఇలా వందలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. జిల్లాల వారిగా, రిజర్వేషన్ కేటగిరి వారిగా గ్రూపుల వారిగా వివరాలు ఇవ్వాలి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జనరల్ అభ్యర్థులకు 36.23 (ఎస్సీ ), 31.23(ఎస్టీ) వాళ్ళకి కటాఫ్ ఇచ్చారు. పరీక్ష అర్హులవ్వడానికి 60 మార్కులు ఇచ్చి కటాఫ్ 30 మార్కులు ఏవిధంగా ఇచ్చారు పూర్తి వివరణ 
ఇవ్వాలి.సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థి మార్కుల వివరములు మరియు రిజర్వేషన్ కేటగిరి  వివరములు, అలాగే సెలెక్ట్ కాని విద్యార్థుల మార్కులు,  రిజర్వేషన్ కేటగిరి వివరాలు ఇవ్వడం లేదు. గోప్యంగా ఉంచుతున్నారు.పరిక్షా ఫీజులు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కువ ఫీజులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో  ఎస్సై ఎగ్జామ్ ఫీజు 500, కానిస్టేబుల్ ఎగ్జామ్
ఫీజు 400, కానీ తెలంగాణలో ఎస్సై ఎగ్జామ్ ఫీజు1000 రూ., కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫిజు 800. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫీజు లేదు. పైగా ఎగ్జామ్ రిజల్ట్ మార్కులు చూసుకోవడానికి కూడా  ఎస్సీ/ఎస్టీ వాళ్ళుకు 1000 రూపాయలు, మరియు బిసి లకు 2000 రూ. కట్టాలని అంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తెలంగాణలో ఫీజులు గుంజుతున్నారు. మొత్తం పొలీస్ పోస్టులు 16925 అయితే అందులో 16,025 మాత్రమే పూర్తి చేశారు. మిగతా 900 పోస్టులు ఎందుకు పూర్తి చేయలేదు.నార్మలైజేషన్ ప్రతి విద్యార్థికి ఎందుకు చేయడం లేదు. చేసిన ఎలా చేశారో విద్యార్థులకు తెలపకుండా ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు. సివిల్ పొలీస్ పోస్టులలో నార్మలైజేషన్ లేకున్నా కూడా అభ్యర్థులకు ఉద్యోగం రాలేదు. ఎందుకు ఇలా లెక్కించారు. ప్రతి విద్యార్థికి వివరణ పూర్తిగా ఇవ్వావలిసిన అవసరం ఉంది.అలాగే అభ్యర్థుల వద్ద ఫీజులు వసూలు చేయకుండా మార్కుల వివరాలు తెలుపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.అలాగే ప్రతి కేటగిరిలో లాస్ట్ కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్న అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి.ఇంకా 1100 పోస్టుల సెలక్షన్ జాబితా ప్రకటించలేదు. వాటిని ప్రకటించాలని కోరారు.

Related Posts