హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు
హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు ముగిశాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ప్యానెల్‌కు, ప్రకాష్ చందద్ జైన్ ప్యానల్ మధ్య రసవత్తరమైన పోటీ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాష్ చందద్ జైన్‌పై 146 ఓట్ల మెజారిటీతో అజారుద్దీన్ విజయం సాధించారు. ఎన్నికల్లో 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. అర్జున్
యాదవ్, నిజాం క్లబ్, భారతి సిమెంట్స్ ప్యానెల్ ఓటు వేయలేదు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ గురువారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2017లో ఇదే పదవికి అజార్ నామినేషన్ వేసినప్పటికీ హెచ్‌సీఏ తిరస్కరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఉండడంతో హెచ్‌సీఏ అధికారులు అజార్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే, అప్పటికే బీసీసీఐ అతడికి క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ ఆ పత్రాలు సమర్పించలేదన్న కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు హెచ్‌సీఏ అప్పట్లో పేర్కొంది.