YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హైద్రాబాద్ లో టీడీపీ నేరు చిరస్థాయి..

హైద్రాబాద్ లో టీడీపీ నేరు చిరస్థాయి..

హైద్రాబాద్ లో టీడీపీ నేరు చిరస్థాయి...
హైద్రాబాద్,

హైదరాబాద్ నగరంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు దేశం పార్టీ ముద్ర, తన ముద్ర ఉంటుందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు.. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లోనే రోడ్లను విస్తరించామని.. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశామన్నారు. పంజాగుట్ట ప్రాంతంలో రోడ్ల విస్తరణకు పి.జనార్దన్ రెడ్డి అడ్డుపడితే.. జనం స్వచ్చంధంగా విస్తరణకు సహకరించారన్నారు. పంజాగుట్ట సెంట్రల్ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఉండేదని.. దాని స్థానంలో సెంట్రల్ ఏర్పాటుకు కృషి చేశానన్నారు. రహేజా మైండ్ స్పేస్ ఏర్పాటు కోసం పలుసార్లు ముంబై వెళ్లొచ్చానన్నారు‘‘ఫార్చ్యున్ 500 కంపెనీలు మెకంజీ చీఫ్ రజత్ గుప్తా ఆధ్వర్యంలో ఓ బిజినెస్ స్కూల్ పెడుతున్నాయని మా సెక్రటరీ పేపర్లో చూశారు. రిలయన్స్, గోద్రేజ్, రజత్ గుప్తాలకు ఫోన్ చేశాను. ఐఎస్‌బీ ఏర్పాటుకు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలను మాత్రమే పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. సరే, ఐఎస్‌బీ సంగతి పక్కనబెడితే ఓ కాఫీ తాగి వెళ్లండని ఆఫర్ చేశాను. దీనికి వాళ్లు సరే అన్నారు.తర్వాత మేం వ్యవహరించిన తీరు, ఇచ్చిన ఆఫర్‌కు వాళ్లు ముచ్చట పడ్డారు. మిగతా మూడు చోట్ల వాళ్లకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. దీంతో వాళ్లు నాకు ఫోన్ చేసి ఏమిస్తారో చెప్పమన్నారు. వాళ్ల ముగ్గురి కొటేషన్ తీసుకొని పంపితే అంత కంటే ఎక్కువే ఇస్తానన్నాను. అలా హైదరాబాద్‌కు ఐఎస్‌బీ వచ్చింది’’ అని చంద్రబాబు తెలిపారు.హైదరాబాద్ నగరం గురించి అనేక అంతర్జాతీయ మ్యాగజీన్‌లలో చదివిన బిల్ గేట్స్ మన నగరానికి వచ్చారని చంద్రబాబు తెలిపారు. మహావీర్ హాస్పిటల్‌లో ఈ విషయాన్ని ఆయనే తనతో స్వయంగా చెప్పారని తెలిపారు. బిల్ గేట్స్‌ను బెంగళూరుకు తీసుకెళ్లడం కోసం నాటి సీఎం ఎస్ఎం కృష్ణ ఎంతగానో ప్రయత్నించారని.. కానీ ఆయన మాత్రం హైదరాబాద్ రావడానికే మొగ్గు చూపారన్నారు. సైబరాబాద్ సిటీని బిల్ క్లింటన్ చేతుల మీదుగా ప్రారంభించామన్నారు.హైదరాబాద్‌లో రాళ్లు రప్పలు తప్పితే ఏమీ లేవని, బెంగళూరు రావాలని ఎస్ఎం కృష్ణ మాట్లాడేవారు. కానీ ఫ్యాషన్‌తో పని చేశానని చంద్రబాబు చెప్పారు. ఇటీవలే ప్రధాని మోదీ మాట్లాడుతూ హ్యూస్టన్ టు హైదరాబాద్ అన్నారు. అంతకు ముందు పీవీ అమెరికా వెళ్లినప్పుడు మీకే కాదు మాకు కూడా మంచి నగరాలున్నాయి. ఓసారి హైదరాబాద్ రండని అమెరికన్లు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవన్నీ తనకు ఆనందాన్ని ఇచ్చాయన్నారు.

Related Posts