YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పశ్చిమ బెంగాల్ లో దీదీ ప్రాభావం కోల్పొతుందా

పశ్చిమ బెంగాల్ లో దీదీ ప్రాభావం కోల్పొతుందా

పశ్చిమ బెంగాల్ లో దీదీ ప్రాభావం కోల్పొతుందా
బెంగాల్,
లోక్ సభ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగించిన భారతీయ జనతా పార్టీ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పై కమలనాధులు దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ కమలం పార్టీ ఆలోచన వేరుగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం పై బీజేపీ పెద్దగా ఆందోళన చెందడం లేదు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపైనే పార్టీ పూర్తిగా దృష్టి పెట్టింది. దేశంలో అసెంబ్లీ స్థానాలపరంగా పెద్దదైన ఈ తూర్పు రాష్ట్రంపై బీజేపీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. 400 పైగా స్థానాలు గల యూపీ తర్వాత 294 స్థానాలతో బెంగాల్ రెండో పెద్ద రాష్ట్రంగా ఉంది. మొదట్లో కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ 1977 నుంచి కమ్యునిస్టుల కంచుకోటగా మారింది. సీపీఎం నేతలు జ్యోతిబసు, భట్టాచార్య దాదాపు పాతికేళ్లపాటు పాలించారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ హవా మొదలయింది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత మమత బెనర్జీ రెండోసారి అధికారంలో కొనసాగుతున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకున్న మమత బెనర్జీ తిరుగులేని నేతగా నిలిచారు. కాంగ్రెస్ 43, సీపీఎం 23, ఆర్ఎస్పీ మూడు స్థానాలు సాధించాయిబెంగాల్ పై బీజేపీ దృస్టి సారించడానికి బలమైన కారణాలున్నాయి. బీజేపీని, మోదీని బహిరంగంగా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీ నేతల్లో మమత బెనర్జీ ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఒకదశలో ప్రధాని అభ్యర్థిగా మమత బెనర్జీ పేరు తెరపైకి వచ్చింది. విపక్షాలను మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టడంలో మమత బెనర్జీ విశేష కృషి చేశారు. బెంగాల్లో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. దీంతో మోదీ వ్యతిరేకులకు మమత బెనర్జీ ఆశాకిరణంగా కన్పించారు. దీంతో మమతా బెనర్జీని రాజకీయంగా దెబ్బ తీయాలని బీజేపీ వ్యూహం రచించింది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఈ మేరకు విజయం సాధించడంతో బీజేపీలో ధైర్యం, స్థైర్యం పెరిగింది. లోక్ సభ ఎన్నికల్లో పెరుగుదల తృణమూల్ కాంగ్రెస్ నేతల్లో, మమత బెనర్జీలో ఒకింత అధైర్యాన్ని కలిగించిన మాట వాస్తవం. పార్టీలో నైరాశ్యం నిండింది. మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో కమలం పార్టీ 18 స్థానాలను సాధించి మమత బెనర్జీకి గట్టి సవాల్ విసిరింది.2014 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో 18 స్థానాలను సాధించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. 2014 ఎన్నికల్లో 16.8 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 2019లో 40.5 శాతం ఓట్లు పెంచుకోవడం బీజేపీ శ్రేణుల్లో ఎనలేని ఆత్మ విశ్వాసాన్ని నింపింది. తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలతో సరిపుచ్చుకుంది. 2014 ఎన్నికల్లో 35 స్థానాలను సాధించిన తృణమూల్ కాంగ్రెస్ దాదాపు డజనకు పైగా స్థానాలను కోల్పోవడం కొడిగడుతున్న ప్రాభవానికి నిదర్శనం.ఈ ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఢంకా భజాయించి చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 8కి గాను నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో బీజేపీలో ధైర్యాన్ని కలిగించింది. అదేవిధంగా గతంలో తృణమూల్ అగ్రనేతలు ముకుల్ రాయ్, విజయ్ వంగ్యా బీజేపీలో చేరడం పార్టీకి బలం కలిగించింది. ఇటీవల మరో ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరారు. టీఎంసీకి చెందిన కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు కూడా బీజేపీలో చేరడం గమనార్హం. ఇవన్నీ బీజేపీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఎనలేని ధైర్యాన్ని కలిగించాయి.దీనికితోడు ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కుదేలవ్వడం బీజేపీకి కలసి వచ్చింది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని సాధించలేకపోయింది. ఒకప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమయింది. బెరహంపూర్ నుంచి ఎన్నికైన అధీర్ రంజన్ చౌధురి లోక్ సభలో పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన అయిదుసార్లు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. బెరంహంపూర్ తో పాటు మరోస్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ, ప్రియరంజన్ దాస్ మున్షీ, అబ్దుల్ ఘనీ ఖాన్ చౌదరి, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం కాంగ్రెస్ శిధిలావస్థలో ఉంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదనడం అతిశయోక్తి కాదు.ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగామని, ఇక అధికారం అందుకోవడమే తరువాయి అన్నది బీజేపీ భావన. ముస్లిం ఓట్లపైన ఇంత వరకూ టీఎంసీ ఆధారపడుతూ వస్తోంది. దీన్ని అదనుగా తీసుకుని హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడం ద్వారా లబ్ది పొందవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనపడుతోంది. అదే సమయంలో ఇటీవల అసోంలో నిర్వహించిన జాతీయ పౌర పట్టిక బెంగాల్లో కలకలం సృష్టించింది. బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ నిర్వహిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనలు తృణమూల్ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసోం మాదిరిగానే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు బెంగాల్ కు పెద్దయెత్తున వలస వచ్చారు. వీరు మొదట్లో కాంగ్రెస్ కు, తర్వాత సీపీఎంకు, అనంతరం టీఎంసీకి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి విరుగుడుగా హిందువులను సమీకరించడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో మమత బెనర్జీ పరువు తీసింది. ఈ కేసులో నాటి కోల్ కత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారన్నది ఆయనపై ఉన్న అభియోగం మొత్తానికి బెంగాల్ విషయంలో బీజేపీ మరింత దూకుడుగా ప్రదర్శించడం అనివార్యంగా కనపడుతోంది. అందుకే ఇటీవల మమత బెనర్జీ మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే నెపంతో ఆయనను కలిశారు. హోంమంత్రి అమిత్ షానూ కలిశారు. ఎన్ఆర్సీ, శారదా చిట్ ఫండ్ కేసుల విషయంలో కేంద్రం దూకుడుగా వెళ్లకుండా ఉండేందుకే మమత బెనర్జీ కలసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద మమత బీజేపీకి భయపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Related Posts