YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఉప ఎన్నికలు గట్టెక్కిస్తాయా

ఉప ఎన్నికలు గట్టెక్కిస్తాయా

ఉప ఎన్నికలు గట్టెక్కిస్తాయా
న్యూఢిల్లీ, 
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్, కేరళలోని పాల, ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, త్రిపురలోని బదర్ ఘర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఉప ఎన్నికలు జరిగాయి. దంతెవాడ, పాల, బదర్ ఘర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక హమీర్ పుర్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ బాందెల్ పై అనర్హత వేటు పడటంతో అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. నాలుగు ఉపఎన్నికలతో ప్రజల నాడిని కనిపెట్టడం కష్టమైనప్పటికీ, వాటి ఫలితాలను ఏక పక్షంగా తోసిపుచ్చలేం. అందువల్లే ఈఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి.హమీర్ పూర్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ బాందెల్ పై ఓ హత్యకేసుతో అనర్హత వేటు పడింది. ఇది 22 ఏళ్ల నాటి కేసు. ఇటీవల లోక్ సభ ఎన్నికల సందర్భంగా కలిసి పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీ ఈ ఉప ఎన్నికల్లో వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టాయి. నౌషర్ ఆవానిని బీఎస్పీ తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. మనోజ్ కుమార్ ప్రజాపతిని ఎస్పీ పోటీచేయిస్తోంది. హర్ దీపక్ నిషాద్ ను హస్తం పార్టీ ఎన్నికల బరిలో నిలిపింది. యువరాజ్ సింగ్ ను బీజేపీ బరిలో దింపింది. మొత్తం 9 మంది బరిలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థి అలమ్ మన్సూరీ పోటీలో ఉన్నప్పటికి ఆయన ప్రభావం నామమాత్రమే. గోరబ్ పూర్, పూల్ పుర్, కైరానా లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలు, నూర్ పుర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గతంలో బీజేపీ భంగపాటుకు గురైంది. ఈ సారి అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అప్పట్లో విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేశాయని, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్నందున వాటికి భంగపాటు ఎదురవుతుందని బీజేపీ తిప్పికొడుతుంది. గత ఎన్నికల్లో హమీర్ పూర్ నుంచి తమ అభ్యర్థి అశోక్ బాందెల్, ఎస్పీ అభ్యర్థి మనోజ్ కుమార్ ప్రజాపతిపై 48వేలకు పైగా మెజారిటీ తో గెలిచారని గుర్తు చేస్తోంది.కేరళలోని పాల అసెంబ్లీ నియోజకవర్గం కూడా కీలక మైనదే. ఇది కొట్టాయా లోక్ సభ స్థానం పరిధిలో ఉంది. కేరళ కాంగ్రెస్ (మణి)కు పట్టున్న నియోజకవర్గం . 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుడు కె.ఎం.మణి గెలుపొందారు. ఆయన మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి కేరళ కాంగ్రెస్ (మణి) పలుమార్లు గెలుస్తూ వచ్చింది. రోమన్ క్యాథలిక్కులు ఆదిపత్యం ఎక్కువ. పాల లో పలు ప్రఖ్యాత విద్యాసంస్థలు ఉన్నాయి. 1987 నుంచి ఇక్కడ కె.ఎం. మణి గెలుస్తూ వచ్చారు. మణిమరణానంతరం ఆయన కుమారుడు జాన్ కె.మణి, సీనియర్ నాయకుడు పిజే జోసఫ్ మధ్య చీలకలు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ( యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్) లో భాగస్వామి అయిన కేరళ కాంగ్రెస్ (మణి)అభ్యర్థి మణి 2016లో 58, 884 ఓట్లు సాధించారు. 42.13శాతం ఓట్లు పొందారు. ఆయనపై పోటీ చేసిన ఎన్.సి.పి (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) 54వేల ఓట్లు సాధించింది. కొట్టాయం జిల్లా బీజేపీ అధ్యక్షడు ఎన్. హరి పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. 2016లో కూడా ఆయనే పోటీ చేశారు. అప్పట్లో ఆయన 17.76శాతం ఓట్లు సాధించారు. ఈ పరిణామం కాంగ్రెస్, సీపీఎం లో కలవరం కలిగించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భాగస్వామి అయిన కేరళ కాంగ్రెస్ (మణి) వర్గం పులికున్నెల్ ను బరిలోకి దింపింది. ఎన్సీపీ నాయకుడు మణి సి.కెప్టెన్ ను అధికార కూటమి బలపరుస్తోంది. ఈ అసెంబ్లీ స్థానం కొట్టాయం లోక్ సభ స్థానం పరిధిలో ఉంది. ఇటీవల జలున లక్ సభ ఎన్నికల్లో పాల లో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ లభించింది.ఉప ఎన్నిక జరుగనున్న చత్తీస్ గఢ్ లోని దంతెవాడ కూడా కీలక స్థానం. ఇది బస్తర్ లోక్ సభ స్థానం పరిధిలో ఉంది. 1,87,641 మంది ఒటర్లున్నారు. 89,591 మంది పురుషులు, 98050 మంది మహిళలు. ఇది సెమీ అర్భన్ అసెంబ్లీ స్థానం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భీమ మందవి, కాంగ్రెస్ అభ్యర్థి దేవతి కర్మపై గెలుపొందారు. అప్పట్లో బీజేపీ కి 37, 990 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 35, 818 ఓట్లు లభించాయి. ఓట్ల తేడా తక్కువైనందున ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని రాష్ట్ర వర్గంలోని భూపేష్ భగల్ చెబుతున్నారు. భీమ మందని మావోయిస్టు చేతిలో పతనమవడంతో ఎన్నిక జరుగుతోంది. గతంలో పోటీ చేసిన దేవతి కర్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఈమె సీఎల్పీ మాజీ నాయకుడు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మహేంద్ర కర్మ సతీమణి. మందని భార్య ఓజోసైవని బీజేపీ పోటీకి నిలిపింది. సానుభూతి పని చేస్తుందని బీజేపీ ఆశ. గతఎన్నికల్లో బీజేపీ రెండువేల ఓట్ల తేడాతో గెలిచింది. త్రిపురలోని బదర్ ఘర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రతన్ రాజ్ బరిలో ఉన్నారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచారు. సిట్టింగ్ సీపీఎం ఎమ్మెల్యే దిలీప్ సర్కార్ అనారోగ్యంతో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన అయిదుసార్లు గెలిచారు. మంజుదార్ అనే టీచర్ ను బీజేపీ పోటీకి దించింది. సీపీఎం బుల్టి బిశ్వాస్ ను బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ 28,561, సీపీఎం కు 23,113 ఓట్లు లభించాయి.

Related Posts