YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మండవ దూరమైపోయారా

మండవ దూరమైపోయారా

మండవ దూరమైపోయారా
నిజామాబాద్, 
ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన పిలిస్తే ఎవరూ రాము పొమ్మనరు. కాని ప్రత్యర్థి వర్గంలో ఉన్న ఆయనను ఎలా పిలవాలి అనుకున్నారో ఏమో సీఎం స్థాయి వ్యక్తి కొంత ప్రెస్టీజీని పక్కకు పెట్టారు. ఏకంగా ఓ రోజు ఉదయం హుటా హుటిన ఆయన ఇంటికి వెళ్లారు. అంతా ఆశ్చర్యం. ఇదేంటి సీఎం ఆయన ఇంటికి రావడమేంటి…. సీన్ కట్ చేస్తే.టీడీపీలో మంత్రిగా 
పనిచేసిన మండవ వెంకటేశ్వర రావుకు మంచి పేరుంది. నిజామాబాదులో మంచి క్యాడర్ ఉండేది. డిచ్ పల్లి నుంచి మండవ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలూ వచ్చాయి. 
అప్పటికే నిజామాబాదులో హోరాహోరి పోరు ఉంది. అక్కడి పార్లమెంటు స్థానం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బరిలో నిలిచారు. మరి సారూ…. కారు…. 16 నినాదంతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ కూతురు గెలుపును ప్రెస్టీజీ గాతీసుకున్నారు. అందుకే నేరుగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రే ఇంటికి రావడంతో మండవ వెంకటేశ్వరరావులోనూ జోష్ పెరిగింది. మళ్లీ రాజకీయ కళ వచ్చింది. ఇంకేముంది కేసీఆర్ కోరినట్లుగానే చకచకా కారెక్కేశారు. నిజమాబాద్ 

సిట్టింగ్ ఎంపీ కవిత మరోసారి అదే స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్దఎత్తున నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 

నామినేషన్లు వేశారు. ఏకంగా 178 మంది రైతులు పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్‌ జిల్లాలో మంచి పేరున్న మండవ వెంకటేశ్వరరావును కేసీఆర్ స్వయంగా 

ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడంతో కవితకు బలం పెరుగుతుందని భావించారు. మండవ వెంకటేశ్వరరావు పార్టీలో చేరడం ద్వారా నిజామాబాద్‌‌లో కవితకు మరింత అనుకూల 

వాతావరణం ఏర్పడుతుందనుకున్నారు. కవితను గెలిపించేందుకు మండవ వెంకటేశ్వరరావు కృషి చేశారు. కాని నిజామాబాదులో మాత్రం కవితకు చుక్కెదురైంది. అక్కడ బీజేపీ అభ్యర్థి 

గెలుపుతో టీఆర్ఎస్ నిరాశ చెందింది. అందులోనూ ముఖ్యమంత్రి కూతురు ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తికి లోనయ్యారు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ 

వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీలో చేరినందున ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. లేదా మండలి ఛైర్మన్ పదవైనా ఇస్తారని అప్పట్లో 

మండవ వెంకటేశ్వరరావు అనుచరులు చర్చించుకున్నారు. కేసీఆర్ గతంలో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వర రావును టిఆర్ ఎస్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చారు. అలాగే 

మండవకూ మళ్లీ మంత్రి పదవి వస్తుందని ఊహించారు.మండవ వెంకటేశ్వరరావు లాంటి గట్టి నేతను చేర్పించుకున్నా కూతురు కవిత ఓడిపోవడంతో కేసీఆర్ తీవ్ర నిరాశ చెందారు. దీంతో 

అక్కడ ఉన్న నేతలపైనా కొంతకాలం నుంచి గుర్రుగా ఉన్నారు. దీంతో ఇటు మండవకూ, అటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కవిత ఎంపీగా గెలిచిఉంటే ఈ 

ఇద్దరి నేతల్లో ఎవరో ఒకరైనా పదవి వచ్చేదేమో. కవిత గెలిస్తే సంతోషంతో కేసీఆర్ వీరిలో ఒకరికి మండలి పదవి, మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టేవారేమో. ఆమె ఓటమి వీరికి 

శాపమైనట్లుగా కనిపిస్తోంది. దీంతో వీరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.

Related Posts