స్వచ్చ దర్శన్ లో వరంగల్
వరంగల్,
దేశవ్యాప్తంగా ఉన్న 700 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్శన్ ఫేస్‌౩ సర్వేలో అర్బన్ జిల్లా మొదటి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛదర్శన్ సర్వేలో దేశవ్యాప్తంగా ఎనిమిది జిల్లాలు మొదటి ర్యాంకులో నూటికి నూరు మార్కులు సాధించాయి. వాటిలో నెం. 1 జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా కాగా తరువాత వరుసలో తెలంగాణకు చెందిన
జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు ఉండగా దీంతో పాటు గుజరాత్ ద్వారక జిల్లా, హర్యానా రాష్ట్రంలోని రేవరి జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి.స్వచ్ఛ దర్శన్‌లో ప్రధానంగా చేపట్టాల్సిన పనుల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, నిర్వహణ, కమ్యూనిటీ సోక్ పిట్స్, కంపోస్టు పిట్స్ ప్రధానంగా ఉన్నాయి. అయితే
స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ దర్శన్ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ కోసం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 700 జిలాల్లోని 100 జిల్లాల్లో స్వచ్ఛ దర్శన్ ఫేస్3 ముందంజ ఉండగా ఎనిమిది జిల్లాల్లో పూర్తిస్థాయి ఈ పథకం అమలు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ
పథకాన్ని నూటికి నూరు శాతం అమలుపర్చడానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్ పర్సన్, మేయర్, కార్పోరేటర్లు, డీఆర్‌డీఏ, ఎన్‌ఆర్‌జీఎస్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్పోరేషన్, కమిషనర్, జడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని
విజయవంతం చేయడంలో వారి వారి పరిధిలో సహకారాన్ని అందించారు.గ్రామాన్ని కార్పోరేటు పరిధిని యూనిట్‌గా తీసుకుని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తు నూటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గ్రామాలు, పట్టణాల్లో బహిరంగ మల మూత్ర విసర్జన చేయకూడదని పేద,
మధ్య తరగతి లబ్ధిదారులకు మరుగుదొడ్ల పథకాన్ని అమలుచేశారు. వరంగల్ నగరంలోని ప్రధాన చౌరస్తాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీల్లో పరిశుభ్రత, బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా ఉండేందుకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తు సులభ్ కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తీసుకరావడంలో సక్సెస్ అయ్యారు.