కర్నూలులో హైకోర్టు సాధించేంత వరకు పోరాటం ఆగదు - న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు ప్రజా సంఘాల మద్దతు
మంత్రాలయం
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు పోరాటం ఆగదని న్యాయవాదులు పేర్కొన్నారు.ఎమ్మిగనూరు న్యాయవాదుల సంఘం రిలే నిరాహార దీక్షకు పలు ప్రజా సంఘాలు, మానవహక్కుల సంఘాలు,జమాతే ముస్లిం సంఘాలు,పెయింటింగ్స్ మరియు ఆర్ట్స్ సంఘాలు మద్దతు తెలిపాయి. శనివారం నాటికి ఆరవ రోజు స్థానిక సోమప్ప సర్కిల్లో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకొని న్యాయవాదులకు పూలమాలవేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు తెలిపారు .అలాగే ఎమ్మిగనూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురు ప్రసాద్ ,మాలపల్లి గురురాజు
,రచ్చుమర్రి జె.విజయ్ కుమార్ మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ సాధించేంత వరకు పోరాటం ఆగదని సృష్టం చేశారు.ప్రభుత్వం వెంటనే కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం ఆడిటర్ శంకర్ ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచ్ గోరుకల్లు కృష్ణ స్వామి ,శివప్ప ,హోటల్ పరమేశ్ ,బాలరాజు న్యాయవాదులకు
పూలమాలవేసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కాంతప్ప ,కే.మల్లికార్జున, ఏసేపు ,ఇస్రాత్ అహ్మద్ ,తదితరులు పాల్గొన్నారు.