YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తవ్వు కొద్ది ఆరాచకాలు నిబంధనలకు పాతర ఈఎస్ ఐ స్కామ్ లో పెద్ద పాములు

తవ్వు కొద్ది ఆరాచకాలు నిబంధనలకు పాతర ఈఎస్ ఐ స్కామ్ లో పెద్ద పాములు

తవ్వు కొద్ది ఆరాచకాలు నిబంధనలకు పాతర ఈఎస్ ఐ స్కామ్ లో పెద్ద పాములు
హైద్రాబాద్,

ఇఎస్‌ఐ స్కాంలో బీనామీల పేరిట వందాలాది కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం కొల్లగొట్టినట్లు ఎసిబి అధికారులు ఆదిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా దేవిక రాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఎసిబి అధికారులు శుక్రవారం ఆరా తీశారు. ఇఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా మందులు కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు కేవలం 6 ఇండెంట్లు మాత్రమే పరిశీలించామని, ఇంకా 
200 ఇండెంట్లుకు సంబంధించి బిల్లులు పరిశీలించాల్సి ఉన్న ట్లు ఎసిబి అధికారులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇఎస్‌ఐ స్కాంలోని నిందితులను ఎసిబి అధికారులు వారం రోజులు పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయ గా, ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్న ట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే సుమారు 200 మెడికల్ ఏజెన్సీల రికార్డులు 
స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు. ఇఎస్‌ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణి అవినీతి తవ్వేకొద్ది వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేవలం మూడేళ్ల కాలం లో దేవికారాణి రూ. 200 కోట్ల మేరకు అక్రమంగా ఆర్జించినట్లు గతంలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు దర్యాప్తు వెలుగుచూసింది. ఈ స్కాంలో ప్రభుత్వ 
ఉద్యోగులతోపాటు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై ఎసిబి, విజిలెన్స్ ఉన్నతాధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అవినీతి వ్యవహారంలో ఐఏఎస్ అధికారి, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సూపరిండెంట్‌తో పాటు ఓ ఛానెల్ ప్రతినిధి హస్తం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యం లో 80 పేజీల దర్యాప్తు 
నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇఎస్‌ఐలో కీలక ఉద్యోగులతో పాటు ఛానెల్ ప్రతినిధి ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవిక రాణి బినామీగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. ఎసిబి అధికారులు చేపట్టిన సోదాలు, దాడుల అనంతరం తయారు చేసిన రిమాంద్ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వాటి వివరాల్లోకి వెళితే..ఎప్పటి నుంచో ఉన్న 
తేజా ఫార్మ 2013 వరకు తేజ ఫార్మ వ్యాపారంలో రాణించలేదు. కాగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా విధులు చేపట్టినప్పటి నుంచి తేజఫార్మ పుంజుకుంది. తేజాఫార్మను బినామీగా చేసుకుని కోట్లాది రూపాయల మందుల కొనుగోళ్లకు పాల్పడినట్లు తేలింది. తేజాఫార్మలో దేవికారాణి తనకు కుమారుడిని వాటా దారునిగా చేసి మందుల కొనుగోళ్లు జరిపిందన్న 
ఆరోపణలున్నాయి. దేవికారాణి కుమారుడిని ఒరిజిన్ ఫార్మా,సెరిడియా కంపెనీలలో వాటా దారునిగా చేసి పెద్ద ఎత్తున ఆయా కంపెనీల నుంచి వైద్య పరికరాలు, మందులు కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులను నివేదికపై ఎసిబి అధికారుల దర్యాప్తు చేపడుతన్నారు. ఒరిజిన్ కంపెనీ యజమాని శ్రీకాంత్, తేజాఫార్మా అధినేత రాజేష్, మందుల సరఫరా దారుడు 
శంకర్‌లు ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి బినామీలుగా ఉన్నట్లు తాజాగా ఎసిబి అధికారులు గుర్తించారు.దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రభుత్వ ధనాన్ని దిగిమింగసాగిందని ఎసిబి అధికారులు గుర్తించినట్లు సమాచారం, బినామి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేతులు కలిపి మం దులు సరఫరా కానప్పటికీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ 
ధనాన్ని కొల్లగొట్టిందని ఎసిబి అధికారులు తమ రిమాం డ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మందుల వైద్య పరికరాల స్టాక్ ఎంట్రి రికార్డులో తన చేతి వాటం చూపుతూ దశల వారీగా రూ.200 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు విజిలెన్స్ ఇచ్చిన నివేదికను ఎసిబి అధికారులు పరిశీలిస్తున్నారు. ఇఎస్‌ఐ మెడికల్ డిస్పెన్సరీలకు కేవలం రూ. 10వేల మందులు సరఫరా చేసి 
రూ.1 బిల్లులకు సృష్టిం చి సర్కారు ఖజానాను కొల్లగొట్టిందని, అలాగే మందుల కంపెనీల నుంచి 20శాతం కమీషన్ సైతం తీసుకుందని విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. అలాగే మెడిసన్ సప్లై బిల్లులోనూ 5 శాతం తీసుకున్నట్లు రుజువైంది. ఈ క్రమంలో ఒకే సంవత్సర కాలంలో రూ.300 కోట్ల మం దులను బినామీ కంపెనీల నుంచి కొనుగోలు చేసింది. ఈ 
నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య కాలంలో రూ. 700 కోట్ల మందులను బినామీ కంపెనీలకు అప్పగించిన వైనంపై ఎసిబి దర్యాప్తు సాగిస్తోంది. 2018 జూ లైలో ఒక్కసారిగా నకిలీ బిల్లులు సమర్పించి రూ.60 కోట్లు అబిడ్స్‌లోని పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి రహస్యంగా తరలించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఇందుకు కార్యాలయ అటెండర్ 
రమేష్‌బాబు, క్లర్క్ ఉపేందర్, సూపరింటెండెంట్ వీరన్నలు కీలక పాత్ర వహించారని వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు ఎసిబి అధికారులు సమాయత్తమౌతున్నారు.ఇఎస్‌ఐ డిపార్ట్‌మెంట్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని పర్చేసింగ్ విభాగంలో విధుల అప్పగించి దోపిడికి పాల్పడటమే కాకుండా నాగలక్ష్మిని బినామీగా మార్చుకున్నట్లు ఎసిబి 
అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఫార్మసిస్ట్ నాగలక్ష్మి డైరెక్టర్ దేవికారాణికి కుడి భుజంగా ఉంటూ 5 మందుల కంపెనీలకు బినామీగా ఉంటూ వచ్చింది. ఒక దశలో ఇఎస్‌ఐలో నాగలక్ష్మి షాడో డైరెక్టర్‌గా వ్యవహరించిందని అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇఎస్‌ఐ అవినీతి భాగోతంలో తన వంతు పాత్ర పోషించిన నాగలక్ష్మి 
దాదాపు రూ.50 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అలాగే ఇఎస్‌ఐలో అన్ని రకాల సర్జికల్ పరికరాల కొనుగోలులో సిడిఎస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నవాజ్‌రెడ్డి డైరెక్టర్ దేవికారాణికి రెండవ బినామీగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పట్ల పూర్తి అవగాహన ఉన్న 
నావాజ్ రెడ్డి సర్జికల్ పరికరాల కొనుగోలులో బినామీ కంపెనీలు సృష్టించి దాదాపు రూ.95 కోట్ల నిధుల స్వాహాకు సహకరించినట్లు గుర్తించారు. ఈక్రమంలో నవాజ్‌రెడ్డి రూ.30 కోట్లు తన వాటా తీసుకుని సంగారెడ్డి, గచ్చిబౌలి, బిహెచ్‌ఇఎల్‌లో భూములు కొన్న భూములపై ఎసిబి విచారణ చేపడుతోంది. ఇఎస్‌ఐలో అకౌంట్స్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా 
విధులు నిర్వహిస్తున్న వీరన్న డైరెక్టర్ దేవికారాణి బినామీగా వ్యవహరించినట్లు దర్యాప్తు అధికారుల విచారణలో తేలింది. వీరన్న తన పెన్‌డ్రైవ్‌లో బినామీ కంపెనీల జాబితా లభ్యమైంది. ప్రభుత్వం నుం చి ఇఎస్‌ఐకి బిల్లులు పొందే విషయంలో వీరన్న కీలక పాత్ర పోషించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఈక్రమంలో ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి అవినీతికి 
సహకరించిన వీరన్న రూ. 40 కోట్లు అక్రమంగా ఆర్జించి తన తండ్రి, సోదరుడి పేరిట భూములు కొన్న భూములపై ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నారు. డైరెక్టర్ దేవికారాణి అక్రమాలలో భాగంగా పుట్టుకొచ్చిన బినామీ కంపెనీలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాటిలో పృధ్వి ఎంటర్ ప్రైజెస్, మైత్రి ఫార్మా, మహిధర మెడికల్, సర్జికల్స్, ఆర్‌ఆర్ ట్రేడర్స్, వైష్ణవ
ఎంటర్‌ప్రైజెస్, గాయ త్రి ఫార్మా, వసుధా మార్కెటింగ్ ఫార్మాస్కుటికల్, సర్జికల్ డిస్టిబ్యూటర్స్, సికోత్రిక్ ఫార్మా, స్వస్తిక్ ఫార్మాస్కుటికల్స్, హిమాలయ ఫార్మా, శ్రీరామ ఫార్మా డిస్టిబ్యూటర్స్, గాయత్రి ఫార్మాలున్నాయని ఎసిబి అధికారులు రిమాండ్ రిపోర్‌టలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా దేవికారాణి విధులు చేపట్టిన కాలంలో 
ప్రభుత్వం దాదాపు 500 కోట్ల రూపాయలు కేవలం మందుల కొనుగోలుకు విడుదల చేసినట్లు ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో 2015, 2016 కాలంలో ప్రభుత్వం రూ. 143 కోట్లు, 2016,2017 కాలంలో రూ. 120 కోట్లు. 2017 నుంచి 2018లో రూ. 208 కోట్ల రూపాయల మేర బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేసిన రికార్డులను ఎసిబి అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.ఇఎస్‌ఐ ఆస్పత్రులకు మందులు, వస్తువులు, మిషనరీల కొనుగోలులో నిబంధనలు పాటించలేదు. రూ.25లక్షలు అంతకు మించి విలువైన టెండర్లకు తప్పనిసరిగా దిన పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. టెండర్‌కు సంబంధించిన ప్రకటన రెండు జాతీయ దినపత్రికల్లో ఇవ్వాలి. దీనిని ఎక్కడా పాటించలేదని ఎసిబి అధికారుల దర్యాప్తులో వెలుగుచూసినట్లు తెలియవచ్చింది. ఇఎస్‌ఐ పరిధిలోని ఆస్పత్రులకు వస్తువులు, మందులు, మిషనరీలు అత్యవసరం ఉన్నప్పుడు నిపుణుల సలహా మేరకు కొనుగోలు చేయాల్సి ఉండగా ఇక్కడ అలాంటివి పాటించకుండా ఇష్టాను సారం కొనుగోలు చేశారని అధికారుల విచారణ తేలినట్లు సమాచారం. అదేవిధంగా వివిధ డిస్పెన్సరీలు, జాయింట్ డైరక్టర్లు, మెడికల్ సూపరింటెండ్‌ల నుంచి ఇండెంట్లు తీసుకుని మందులకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉండ గా ఇఎస్‌ఐ డైరక్టర్ వారి వద్ద నుంచి ఎలాంటి ఇండెంట్ తీసుకోకుండానే కొనుగోళ్లు 
చేసినట్లు ఎసిబి రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. డిస్పెన్సరీలు, ఆస్పత్రులకు సరఫరా చేసే డ్రగ్స్, సర్జికల్ ఐటమ్స్‌ను ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉండగా కనీసం కమిటీని ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదని, ఓపెన్ టెండర్ విధానాన్ని పాటించలేదని ఎసిబి అధికారులు గుర్తించినట్లు తెలియవచ్చింది.

Related Posts