YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత భార్య

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత భార్య

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత భార్య
విశాఖపట్నం 
 జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొందరు ప్రాణాలతో పట్టుబడినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. మావోయిస్టుల అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసులు అదుపులో ఉన్నారు. ఏజెన్సీలో జరిగిన 
ఎదురుకాల్పుల్లో అరుణ గాయపడ్డారు. ఈ క్రమంలో గాయాలతో ఉన్న అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని.. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం అరుణను మరింత విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Posts