గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు
గాలిలో కలిసిన పాలన
విజయవాడ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో బీజేపీ నేతలు శనివారం గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచందన్ ని కలిసారు. మూడు అంశాలపై గవర్నర్ కి వినతి పత్రం అందజేసారు. తరువాత కన్నా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. గ్రామ సచివాలయం,వార్డ్ వలంటీర్ల పరీక్షలు కూడా అపహాస్యం చేశారని అన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయలేదు. ఇస్తానుసారంగా నియామకాలు చేశారు. భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం వలన కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. సెప్టెంబర్ 5 దాకా ముహూర్తం పెట్టారు ప్రజల కడుపులు మాడుతున్నాయని లేఖ రాసిన పట్టించుకోలేదు. ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు. సీఎం చేతలు,మాటలకు పొంతన లేదు. ఇసుక బ్లాక్ లో దొరుకుతుంది తప్ప ప్రజలకు అందడం లెదని అన్నారు. దేవాలయ భూములు విషయం లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 2017 లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు నిలిచిపోయాయని వారికి పోస్ట్ లు ఇవ్వాలని గవర్నర్ కి తెలియజేసామని అన్నారు.
సమస్యల పరిష్కారం కై అవసరమైతే విజయవాడలో ధర్నా చేస్తాం. ప్రజా సమస్యలను రాష్ట్రంలో గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి జగన్ మాటలు మహాత్మాగాంధీలా ఉన్నాయి, చేతలు మాత్రం జరగట్లేదని అన్నారు. దేవాలయ భూములను స్వంత భూముల్లా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. 2017లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షలు జరిగాయి, ఇంకా
నియామకాలు జరగలేదు. ప్రభుత్వం ఈ అంశాలపై రియాక్ట్ కాకపోతే ధర్నాకు దిగుతామని అన్నారు.