భూమన్న యాదవ్ ను విడుదల చేయాలంటూ సర్పంచుల ఆరెస్టు
సికింద్రాబాద్.
భూమన్న యాదవ్ ను వెంటనే విడుదల చేయాలంటూ సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయం ముందు సర్పంచులు ఆందోళనకు దిగారు. సర్పంచుల చెక్ పవర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా హుజూర్ నగర్ నుండి పోటీ చేయడానికి సర్పంచులు వెళ్లారు. వారిని మధ్యలో అడ్డగించి నలుగురు సర్పంచులను తమ అదుపులోకి టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకున్నారని వారు ఆరోపించారు. సర్పంచుల సంఘంరాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ అక్రమంగా సర్పంచులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అరెస్ట్ లు చేయొచ్చు కానీ మా పోరాటాన్ని ఆపలేరు. ప్రభుత్వం పోలీసులను పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూస్తుంది, నలుగురు ని అరెస్ట్ చేసినంత మాత్రాన సర్పంచు లందరిని బయపెట్టలేరని అన్నారు. తెలంగాణలోని 12 వేల 700 మంది సర్పంచులు రోడ్డెక్కుతారు.. ప్రశ్నించే హక్కు లేదా,పోటీ చేసే హక్కు లేదా ఇది ప్రజాస్వామ్యం లోనే ఉన్నామా లేదా అని ప్రశ్నించారు., ఇప్పటికైనా బూమన్న యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు.