నరసింహ స్వామి సన్నిధిలో అమావాస్య పూజలు
మొక్కులు తీర్చుకున్న భక్తులు
కౌతలము
ఊరుకుంద మండల పరిధిలోని ఊరుకుంద లో వెలసిన పుణ్య క్షేత్రము ఈరన్న స్వామి కొలిచే కొంగు బంగారం ఈరన్న స్వామి. వారి మనసు లో ఎన్ని కోర్కెలు ఉన్న తీర్చ గలిగె మహిమల దేవుడు ఈరన్న స్వామి. శని వారం అమావాస్య విశేష రోజు కావడంతో భక్తులు బరిగా తరలి వచ్చారు. వారి విశేష దినోత్సవన్ని పురస్కరించుకొని విశేష పూజలు
నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్ ను పూలు వెండి ఆభరణాలు తో అలంకరించారు. ఉదయం 6 గంటల సుప్రభాత సేవ నుంచి రాత్రి 8 గంటల వరకు మంగళ హారతి నిర్యహించరు. ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందిన భక్తుల సమక్షంలో 8 నుంచి 10 వరకు అవినేటి మండపంలో స్వామి వారికి పంచామృత అభిషేకలు సాయంత్రం ఆరు
నుంచి ఎనిమిది వరకు ధ్వజ స్థంభం వద్ద ప్రకరోత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శననికి వచ్చిన భక్తలకు నిర్మించిన గదులు విడది భావనలు ఏర్పాటు చేశారు.