బురదమయంగా పెండేకల్ ఆర్.ఎస్ రహదారి
తుగ్గలి
మండల పరిధిలోని పెండేకల్ రైల్వే స్టేషన్ లో గల ప్రధాన రహదారి వర్షాకాలం వచ్చిందంటే,అక్కడ ఉన్న మట్టి రోడ్లు బురదమయంగా తయారు అవుతున్నాయి.ఆ దారి గుండా వెళ్లే ప్రజలు నడవాలన్న,వాహనాలపై వెళ్లాలన్న చాలా ఇబ్బందికరంగా రోడ్లు ఉన్నాయని స్థానిక సిపిఐ నాయకుడు మాబు పీరా,గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లు మురికి కుంటలను తలపిస్తున్నాయని,పాఠశాలకు వెళ్లే విద్యార్థులు,ప్రజలు బురదలో నడవాల్సి దుస్థితి నెలకొందన్నారు.ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీళ్లు రోడ్లపై చేరి పారిశుధ్యం లోపించి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు తగినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.వర్షానికి వర్షపు నీరు ఆగి రోడ్లు
చాలా అధ్వానంగా బురద బురదగా మారుతునందున సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సిసి రోడ్లువేయాలని సిపిఐ నాయకుడు మాబు పీరా స్థానిక ప్రజలు కోరుతున్నారు.