జనం రాక....... బస్సులులేక.....
పేత్తర మావాస్యకు పల్లెలు చేరుకుంటున్న పట్నం జనం
వనపర్తి
పట్టణాల్లో నివాసముంటున్న పల్లె ప్రజలంతా పేతరామావాస్యకు పల్లెలకు చేరుకుంటున్నడం వల్ల గోపాల్ పేట బస్ స్టాండ్ జనసందోహంతో నిండిపోయింది. ముఖ్యంగా ఒకపక్క పేతరాఅమావాస్య మరోపక్క దసరా సెలవులు రావడం వల్ల పట్టణాలలో ఉన్న వారంతా కూడా పల్లెలకు వస్తుండడంతో ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు జన సందోహంతో నిండుకుని పోయాయి. అందులో ప్రధానంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అందరు కూడా పట్టణాలలో నివాసముంటూ పండుగలకు రావడం వల్ల వారికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలలో మరియు ఇతర వాహనాలలో వారివారి గమ్యాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు సరియైన సమయానికి రాకపోవడం వల్ల జనమంత గంటల తరబడి బస్టాండ్ లో నిలుచొని బస్సుల కోసం వేచిచూస్తూ, టి, టిఫిన్ల కోసం హోటళ్లకు బారులుతీరారు. ఈ పరిస్థితుల్లోనైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల తగ్గట్టుగా బస్సు నడిపి వారికి సౌకర్యం కలిగించాలని పలువురు కోరుతున్నారు