YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నంద్యాల లో మంత్రి బుగ్గన పర్యటన

నంద్యాల లో మంత్రి బుగ్గన పర్యటన

నంద్యాల లో మంత్రి బుగ్గన పర్యటన
నంద్యాల సెప్టెంబర్ 28 :
నంద్యాల ప్రాంతంలో వరద వల్ల పంట, ఇళ్లు, రోడ్లు తదితర నష్టం నివేదికలను మానవత్వంతో, నిబంధనల మేరకు పగడ్బందీగా, పారదర్శకంగా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపండని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. 
శనివారం మధ్యాహ్నం నంద్యాల డివిజన్ మసీదుపురం, దీబగుంట్ల, ఎర్రగుంట్ల లో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించి, బాధితులను అయన  పరామర్శించారు. మంత్రి వెంట  రాష్ట్ర రైతు మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే లు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జడ్పీ మాజీ చైర్మన్ నాగిరెడ్డి తదితరులు వున్నారు.   నంద్యాల నియోజకవర్గం దీబగుంట్ల వద్ద మహేశ్వరయ్య అనే రైతు కు చెందిన 15 ఎకరాల వరిపొలం నీటమునకను పరిశీలించి, పంట పెట్టుబడి, నష్టం వివరాలను రైతు నుండి అడిగి తెలుసుకుని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రైతన్నకు ధైర్యం చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎర్రగుంట్లలో వరద ప్రవాహం వల్ల తెగిపోయిన రోడ్డు బ్రిడ్జ్ ను పరిశీలించి వరద నష్టాన్ని చూసి, వరదబాధితులను పరామర్శించారు. జిల్లాలో నంద్యాల, కర్నూలు, ఆదోని డివిజన్ లలో ఆకస్మిక వరదల వల్ల 23 మండలాల్లో 38,000 ల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నంద్యాల డివిజన్ లో 166 శాతం అధిక వర్షం కురవడంతో దాదాపు వెయ్యి కోట్లకు పైగా వరద నష్టం సంభవించినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వివరించారు.  ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు వరదబాధితులకు ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ ఉల్లిపాయలు, లీటర్ పామాయిల్, కేజీ అలు గడ్డల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు.  పంట నష్టం వివరాల ఎన్యూమరేషన్ ను వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పగడ్బందీగా చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15 శాతం అధికంగా వరద సాయాన్ని చేర్చి ఫైనల్ వరద నష్టం వివరాలను సిద్ధం చేస్తున్నామని మంత్రికి వివరించారు.

Related Posts