జీ ఆర్ గ్యాంగ్ ముసుగులో ఎమ్మెల్యే అనుచరుల దాడులు
ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ప్రేంగాంధీ
హైదరాబాద్ సెప్టెంబర్ 28 :
అధికార పార్టీల ఎమ్మెల్యేలైన బాజీ రెడ్డి గోవర్థన్ రెడ్డి, బీగాల గణేశ్ ల అనుచరులైన జీ ఆర్ గ్యాంగ్ స్థానిక ఆర్యవైశ్యులపై దాడులు, బెదిరింపులకు పాల్పడి వారి ఆస్తులు కాజేస్తున్నారని
వారిపై డీజీపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ప్రేంగాంధీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులగా చెప్పకుంటూ దాడులకు
పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదగూడలోని ఎన్ ఎస్ ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాధితులు ఉప్పల నాగరాజు, ఉప్పల పద్మవతి, ప్రీతం కుమార్ ,
భరత్ లతో కలిసి ప్రేంగాంధీ మాట్లాడారు. నిజామాబాద్ పట్టణంలో ఆర్య వైశ్యులే టార్గెట్ గా ఇటివలకాలంలో బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి, బీగాల గణేశ్ గుప్త అనుచరులమని చెప్పకుంటున్న
గాడిల రాములు అతని అనుచరులు షఫి, అన్నావర్ , సాజిద్ , జబ్బార్ , నాభి, షానుపాషా , ముత్యం రెడ్డి, బాబురావు తదితరులు గత కొంత కాలంగా ఆర్యవైశ్యులే టార్గెట్ గా
దాడులకు పాల్పడుతు తమ ఆస్తులను కబ్జా చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టనట్టు వ్యవరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై
నిజామాబాద్సీపీకి ఫిర్యాదుచేసిన వారు భాధిలకు న్యాయం చేయాలదన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి , మంత్రి కేటీఆర్ స్పందించి భాధితులకు న్యాయం చేయాలని లేని
పక్షంలో నిజామాబాద్ కలెక్టరెట్ ను , ఎస్పీ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్తి శ్రీనివాస్ , అల్లంపల్లి ఉదయ్ కుమార్ , శ్రవణ్ గుప్త
తదితరులు పాల్గొన్నారు