YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అమితాబ్‌కు తీవ్ర అనారోగ్యం.. 

Highlights

  • జోధ్‌పూర్‌కు వైద్యబృందం పరుగులు
అమితాబ్‌కు తీవ్ర అనారోగ్యం.. 

భారతీయ సినీ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 75 ఏళ్ల బిగ్‌బీ వృద్ధ్యాప్యంతో కూడిన సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. గతంలో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి విజయం సాధించారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కడుపులో నొప్పితో ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేరగా ఆయనకు చికిత్సనందించారు.అమితాబ్‌కు చికిత్సనందించేందుకు వైద్యబృందం హుటాహుటిన జోధ్‌పూర్‌కు చేరుకొన్నది. ప్రస్తుతం జోధ్‌పూర్‌లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా ఆయన ఆరోగ్యానికి అంత ముప్పేమీ లేదని వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తున్నది. అనారోగ్యం తీవ్రత మరింత ఎక్కువైతే ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు సమాచారం. అయితే  బిగ్‌బీ అనారోగ్యానికి కారణాలు తెలియరాలేదు.


 

Related Posts