YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆక్టోబర్ ఒకటినుంచి నూతన మద్యం విధానం అమలు

ఆక్టోబర్ ఒకటినుంచి నూతన మద్యం విధానం అమలు

ఆక్టోబర్ ఒకటినుంచి నూతన మద్యం విధానం అమలు
విజయవాడ
అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు అవుతుంది. మద్యం వలన అనేక కుటుంబాలు ఛిన్నా భిన్నం అయ్యాయి. ప్రస్తుతం 450 షాపులు ప్రభుత్వం నిర్వహిస్తుంది . అక్టోబర్ ఒకటి నుంచి పూర్తిస్దాయిలో 3500 షాపులను నిర్వహిస్తామని ఎక్సైస్ మంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాదారు. మద్యం షాపులను  నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగనియామకాలను చేశాం. ఎక్కడా అవినీతి జరగకుండా ఎక్సైస్ శాఖ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. 678 కొత్త ఎక్సైస్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్ పంపామనివ అయన అన్ఆనరు. మహిళలు , ప్రతిపక్షం వారు కూడా మద్య విధానానికి , దశలవారీ మద్య నిషేధానికి సహకరించాలి . లెల్టు షాపులు నిర్వహించే వారికి వేరే ఉపాది కోసం కలెక్టర్లతో మాట్లాడాం. ధరల విషయంలో త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాం. బార్ షాపుల సమయం పై కూడా చర్చిస్తున్నాము త్వరలోనే కచ్చితంగా సమయం కుదింపు ఉంటుందని వెల్లడించారు. బెల్టు షాపులు పెట్టకుండా కఠిన మైననిర్ణయాలు తీసుకుంటున్నాం. మహిళలు ఖచ్చితంగా వచ్చి మాకు మద్యం దుకాణం వద్దు అంటే అక్కడడ వాస్తవ పరిస్తితులకు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి  అన్నారు.  

Related Posts