ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
కౌతాలం
ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు భగత్ సింగ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నారాయణ డిగ్రీ కళాశాలలో ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస అధ్యక్షతన 112 జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఏ ఎస్ ఐ శ్రీనివాస రెడ్డి,
సీపీఎం లింగాన్న హాజరయ్యారు. వారు మాట్లాడుతూ భగత్ సింగ్ జయంతి వేడుకలకు మి అందరి సమక్షంలో జరుపుకోవటం ఆనందం గా ఉన్నదని స్వాతంత్ర సమరయోధులు ను స్మరించు కున్నప్పుడే వారు కన్న కలలు నిజమౌతాయనీ ప్రతీ ఒక్కరూ భగత్ సింగ్ లా ఉండాలని పోరాడాలని,కోరారు. మీరు బాగా చదువుకొని తల్లి తండ్రులు పేరు నిలబెట్టాలని
కోరారు.విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలకు సహకరించాలని ప్రతీ ఇంటిలో ఒక భగత్ సింగ్ పుట్టలనీ కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమ కారుడు, డిల్లీ విదిలో ఎఱ్ఱ కాగితాలు చల్లిప్రజలను చైతన్య పరిచారు,విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో ముందుకు సాగిన ప్రభావ శిల విప్లవ కరులలో సింగ్ ఒకరు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 బంగ అనే
ఊరిలో జన్మించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్,ఉపాధ్యాయులు,మహేష్ కార్తీక్ విద్యార్థినీ ,విద్యార్థులు,పాల్గొన్నారు.