వ్యవసాయ మార్కెట్లకు మంచి రోజులు
ఏలూరు,
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు మరిన్ని సౌకర్యలు కల్పించి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన 13 వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించి వాటిని మోడల్ మార్కెట్లుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించింది. రాష్ట్రంలో 191 వ్యవసాయ మార్కెట్లు, 324 మార్కెట్లు ఉన్నాయి. వీటి ద్వారా వ్యాపార లావాదేవీలు పెద్ద త్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.3,212 కోట్ల 35 లక్షలు కేటాయించింది. అలాగే పప్పు్ధన్యాలు సేకరించి రైతులను ఆదుకోవడానికి ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.100 కోట్ల 69 లక్షలు రివాల్వింగ్ ఫండ్ కింద కేటాయించింది. ధరల స్థిరీకరణకు ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లు మంజూరుచేసింది. దళారుల నుంచి రైతులను రక్షించడానికి ధరల స్థిరీకరణ దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రంలోని ఆదోని, అనకాపల్లి, దుగ్గిరాల, గుంటూరు, గజపతినగరం, హిందూపురం, కడప, కర్నూలు, కుప్పం, మదనపల్లి, నందిగామ, పొదలకూరు, రావులపాలెం వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించి మోడల్ మార్కెట్లగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ 13 మోడల్ మార్కెట్లలో గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజీ, నాణ్యత పరిక్షించే ల్యాబ్‌లు, ఈ నామ్ వౌళిక సదుపాయాలు, రైతుశిక్షణ కేంద్రాలు, తాగునీరు, సీసీ టీవీలు, ధరల ప్రదర్శన బోర్డులు, వేయింగ్‌మిషన్లు, వ్యర్థప్రదార్ధాల నిర్వహణ, విద్యుత్, పవర్‌బ్యాకప్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగనుంది. అలాగే ఏఎంఐఎఫ్ కింద వ్యవసాయ మార్కెట్‌లో వౌళిక సదుపాయాల నిధికి 85 మార్కెట్లను ఎంపిక చేసి రూ. 327.57 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల్లో 10.50 లక్షల ఎంటీ సామర్థ్యం గల 1054 గోడౌన్లు ఉన్నాయి. వీటి సంఖ్య పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుగ్గిరాల, కడప, భట్టిప్రోలులో మార్కెట్‌యార్డుల్లో పసుపు, ఆదోని మార్కెట్ యార్డులో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 22 ఇనామ్ విధానం అమలు చేస్తున్నారు. కొత్తగా 12 మార్కెట్‌యార్డుల్లో ఈనామ్ విధానం అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈనామ్ ద్వారా ఇప్పటికే దేశంలోనే గుంటూరు వ్యవసాయ మార్కెట్ రూ.7190.91 కోట్ల వ్యాపారం చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఆన్‌లైన్ చెల్లింపులో దుగ్గిరాల మార్కెట్ 4268 ఆన్‌లైన్ చెల్లింపులు చేసి మొదటి స్థానంలో నిలిచింది. వేరుశెనగ విక్రయాలు కర్నూలు మార్కెట్ నుంచి తెలంగాణలోని గద్వాల్ మార్కెట్ మధ్య వాణిజ్యం జరగడానికి ఇంటర్ స్టేట్ వాణిజ్యం ప్రారంభమైంది. రాష్ట్రం నుండి పండ్ల ఎగుమతి కోసం విజయవాడ, తిరుపతిలో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 170 వ్యవసాయ మార్కెట్లు, 18 రైతు బజార్లలోని ధరలను తెలుసుకోవడానికి అగ్‌మార్క్‌షెట్ పోర్టల్‌ను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసింది. మార్కెట్ల ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.49,239.40 లక్షల ఆదాయం రాగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 57,470.20 లక్షల ఆదాయం లక్ష్యంగా చర్యలు చేపట్టింది. జూన్ నాటికి రూ.11,339.84 లక్షల ఆదాయం మార్కెట్‌యార్డుల ద్వారా వచ్చింది. ఆదాయం మరింత పెంచి రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ముమ్మరం చేస్తోంది.