YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అనుబంధ సంఘాల పై టీడీపీ 

అనుబంధ సంఘాల పై టీడీపీ 

అనుబంధ సంఘాల పై టీడీపీ 
విజయవాడ, 
 తెలుగుదేశం పార్టీలో సరికొత్త మార్పులను తీసుకువచ్చేందుకు నిర్ణయించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయదశమి నుండే పార్టీ ప్రక్షాళన చర్యలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా అనుబంధ సంఘాల కార్యవర్గాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యంగా మహిళలు, యువత, బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబులం వేయనున్నారు. అనుబంధ సంఘాల ఎంపిక పూర్తియిన తరువాత నవంబరు నెలాఖారుకు అన్ని అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు. తరువాత పార్టీలోనూ సమూల మార్పులకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీకి ఉన్న అన్ని అనుబంధ సంఘాలకు నూతన కార్యవర్గాలను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రక్రియ దసరాకు ప్రారంభించి, నవంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. అనుబంధ సంఘాలలో 33 శాతం యువత, 33 శాతం మహిళలు, 50 శాతం బడుగు, బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. సామాజిక వర్గాల జనాభా ఆధారంగా వారికి పదవులలో అవకాశాలు ఇవ్వనున్నారు. అలాగే కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు బాగాలేని వారిని కార్యవర్గంలోని మెజారిటీ సభ్యుల నిర్ణయంతో రీకాల్ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ జిల్లా కమిటీలుగానే ఉండేవి, అయితే ఇకపై పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నవంబరు నెలాఖరుకు అన్ని సంఘాల కార్యవర్గాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. అనుబంధ సంఘాల ప్రక్షాళనతోనే తెలుగుదేశం పార్టీలోనూ కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి

Related Posts