YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బాలా త్రిపుర సుందరీగా బెజవాడ దుర్గమ్మ

బాలా త్రిపుర సుందరీగా బెజవాడ దుర్గమ్మ

బాలా త్రిపుర సుందరీగా బెజవాడ దుర్గమ్మ
విజయవాడ, 
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జగన్మాత బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత త్రిపుర సుందరీదేవి. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.నవరాత్రి ఉత్సవాల రెండో రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం.సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి. అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజు నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.

Related Posts